
హైదరాబాద్ సిటీ, వెలుగు : అక్రమంగా 103 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని రవాణా చేస్తున్న ఒకరిని హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ సౌత్ జోన్ పోలీసులు, సివిల్ సప్లయీస్ అధికారులు, చంద్రాయణగుట్ట పోలీసులు కలిసి పట్టుకున్నారు. వీటి విలువ రూ. 4 లక్షలు ఉంటుందని టాస్క్ఫోర్స్అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. చంద్రాయణగుట్టకు చెందిన విక్వర్, అలీమ్ పీడీఎస్ బియ్యాన్ని తక్కువ ధరకు కొని, అవసరమైన వారికి ఎక్కువ ధరకు అమ్ముతుంటారు.
బియ్యాన్ని బోరబండకు చెందిన యూసుఫ్ (45) డీసీఎంలో మహారాష్ట్రకు తరలిస్తుండగా చంద్రాయణగుట్టలో పట్టుకున్నారు. యూసుఫ్ ను అరెస్ట్ చేసి, బియ్యాన్ని చంద్రాయణగుట్ట పోలీసులకు అప్పగించారు. దాడుల్లో సౌత్ జోన్ ఇన్‌స్పెక్టర్ ఎస్. రాఘవేంద్ర, ఎస్ఐలు ఎం. మహేశ్, కె. నర్సింలు, జి. ఆంజనేయులు, ఎన్. నవీన్ పాల్గొన్నారు.