హైదరాబాద్ లో హ్యాష్ ఆయిల్ పట్టివేత.. కారు, రూ. 5 లక్షలు స్వాధీనం

హైదరాబాద్ లో భారీగా హ్యాష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. హైదరాబాద్ లోని చందానగర్ రైల్వే స్టేషన్ సమీపంలో అనుమానంగా ఉన్న కారును నిలిపివేసి తనిఖీ చేయగా.. అందులో 1.5 కేజీ హ్యాష్ ఆయిల్ గుర్తించారు పోలీసులు. ఈ తనిఖీల్లో రూ.5 లక్షలతో పాటు ఒక కారును స్వాధీనం చేసుకున్నారు.

ఒరిస్సా ప్రాంతం నుంచి హైదరాబాద్ కు హ lశిష్ ఆయిల్ తరలిస్తున్నారని గురువారం ( డిసెంబర్ 5, 2024 ) సమాచారం అందుకున్న పోలీసులు.. తనిఖీలు నిర్వహించి హ్యాష్ ఆయిల్ ను పట్టుకున్నారు.ఈ కేసులో కర్ణాటకకు చెందిన కొండే మల్లికార్జున్, హైదరాబాద్ చెందిన మహమ్మద్ రహమాన్ ఖాన్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. 

ALSO READ : కేబుల్ దొంగల ముఠా అరెస్ట్.. రూ.3.5 లక్షల కాపర్ వైర్ స్వాధీనం

ఈ కేసుతో సంబంధం ఉన్న మరో ముగ్గరిపై కూడా కేసు నమోదు చేశారు పోలీసులు. ఇదిలా ఉండగా.. పురానాపూర్ లో నిర్వహించిన మరో తనిఖీల్లో 1.1 కేజీల గంజాయిని సీజ్ చేశారు పోలీసులు.