హైదరాబాద్‌లో పోలీస్ అధికారులపై బదిలీ వేటు.. కారణమిదే!

హైదరాబాద్‌లో పోలీస్ అధికారులపై బదిలీ వేటు.. కారణమిదే!

సిటీలో 8మంది పోలీస్ అధికారులను బదిలీ చేస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ శనివారం ఉత్తర్వలు జారీ చేశారు. సికింద్రాబాద్, అశోక్ నగర్ ప్రాంతాల్లో జరిగిన ఉద్రిక్తతలో ఆందోళనకారులతో దురుసగా ప్రవర్తించిన 8మంది పోలీస్ అధికారులపై బదిలీ వేటు పడింది. చిక్కడపల్లి సిఐ సీతయ్య తమను చాలా బూతులు తిట్టాడని, లాఠీచార్జ్ లో విపరీతంగా కొట్టారని గ్రూప్ 1 అభ్యర్థులు కేంద్ర హోం సహాయక మంత్రి బండి సంజయ్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే సెంట్రల్ మినిస్టర్ హైదరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ కు ఫోన్ చేసి మాట్లాడారు. 

ALSO READ | యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ త్వరలోనే ఏర్పాటు: సీఎం రేవంత్

పోలీసులు వ్యవహరించిన తీరు పట్ల బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆందోళనకారులపై అత్యుత్సాహం ప్రదర్శించిన చిక్కడపల్లి సిఐ సీతయ్యతోపాటు మరో ఏడుగురు పోలీస్ అధికారులను బదిలీ చేస్తూ హైదరాబాద్ సీపీ యాక్షన్ తీసుకున్నారు.