హైదరాబాద్ సిటీ, వెలుగు: ప్రభుత్వం నిషేధించిన చైనా మాంజా విక్రయిస్తే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని టాక్స్ ఫోర్స్ అడిషనల్ డీసీపీ అందే శ్రీనివాస్ రావు హెచ్చరించారు. సోమవారం పురాని హవేలీలోని డీసీపీ ఆఫీస్లో ఆయన మాట్లాడారు. సంక్రాంతి నేపథ్యంలో అక్టోబర్ నుంచే చైనా మాంజాలపై నిఘా పెట్టామన్నారు.
ప్రత్యేకంగా ఏడు పోలీసు బృందాలను ఏర్పాటు చేసి ఇప్పటివరకు 107 కేసులు నమోదు చేసి, 148 మంది వ్యాపారులను అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. దాదాపుగా రూ.90 లక్షల విలువైన 7,334 చైనా మాంజా బాబిన్స్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.