పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్ ఆఫర్ అంటూ సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్న మేసేజ్లపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు క్లారిటీ ఇచ్చారు. ఆ మేసేజ్ లు నకిలీవని, సిటిజన్లు ఎవరూ నమ్మొద్దు.. వాటిని షేర్ చేయొద్దని స్పష్టం చేశారు.
ఫేక్ మేసేజ్ లో హైదరాబాద్ లో పెండింగ్ లో ఉన్న వెహికల్ చలాన్లపై డిస్కౌంట్ ఇస్తున్నట్లు రాసి ఉంది.. బైక్ లపై 80 శాతం తగ్గింపు, కార్లపై 60 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.ఈ ఆఫర్ డిసెంబర్ 26 నుంచి 2025 జనవరి 10 వరకు చెల్లుబాటు అవుతుందని తప్పుడు ప్రచారం సాగుతోంది.
దీనిపై ట్రాఫిక్ పోలీసులు స్పందిస్తూ ట్వీట్ చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్ డిపార్ట్ మెంట్ నుంచి వచ్చింది కాదని.తప్పుడు ప్రచారం.. ఎవరూ నమ్మొద్దు అని ట్వీట్ లో స్పష్టం చేశారు.
Also Read :- అమెరికన్ ఎయిర్ లైన్స్ విమానాలు నిలిపివేత
గతంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ డిపార్టుమెంట్ వాహనదారులకు డిస్కౌంట్ ఆఫర్లను అందించింది. 2023 డిసెంబర్ లో ప్రకటించి 2024 ఫిబ్రవరి 15న ఆఫర్ ను ముగించింది. అదే విధంగా 2022 మార్చిలో కూడా ప్రకటించింది. 2022 మార్చి 31 నుంచి ఏప్రిల్14 వరకు ఈ ట్రాఫిక్ చలాన్ ఆఫర్ ను అందించబడింది.
ఇలాంటి ఫేక్ న్యూస్ ఎవరూ నమ్మొద్దు.. షేర్ చేయొద్దు.. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారంపై అప్రమత్తంగా ఉండాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు.