హైదరాబాద్ కూకట్ పల్లి నడిరోడ్డుపై ఓ యూట్యూబర్ ఓవర్ యాక్షన్ పై పోలీసులు సీరియస్ అయ్యారు. ప్రజలను ఇబ్బంది పెట్టేలా ప్రవర్తిస్తే జైలు ఊచలు లెక్కపెట్టాల్సి వస్తుందని ఏసిపి శ్రీనివాస్ రావు హెచ్చరించారు. మీ వ్యూస్ కోసం ఇస్టానుసారంగా ప్రవర్తించవద్దని వార్నింగ్ ఇచ్చారు. కేరీర్ పై దృష్టి పెట్టాల్సిన యువత ఇలా దారి తప్పడం మంచిదికాదన్నారు. మీ చేష్టలతో మీతో పాటు ఇతర కుటుంబాలు ప్రమాదంలో పడతాయన్నారు. గురువారం హైదరాబాద్ రోడ్లపై డబ్బులను చల్లుతూ హంగామా చేశాడు ఓ యువకుడు. గురువారం రద్దీ రోడ్లపై కరెన్సీ నోట్లు చల్లుతూ.. వాటిని వీడియోస్ తీసి ఇంస్టాగ్రామ్ లో రీల్స్ చేస్తున్న వంశీ అనే యువకుడిపై కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ లో పలు సెక్షన్లపై కేసులు నమోదు చేసినట్లు SHO ముత్తు తెలిపారు.
అలాగే యూట్యూబర్ మహాదేవ్ పై కూడా ఐపీసీ 336, 341,290 , BNS 292 125 సెక్షన్ల కింద KPHB పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు పోలీసులు చెప్పారు. ఎప్పుడూ రద్దీగా ఉంటే కేపీహెచ్ బీ లో డబ్బులు పైకి విసిరివేస్తూ వీడియోలు తీస్తూ ఇన్ స్టాగ్రామ్ లో అప్ లోడ్ చేశాడు. దీనిపై సీరియస్ అయిన పోలీసులు.. రీల్స్ పై ప్రజలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రీల్స్ పై సమాజానికి ఇబ్బందికి కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.