హనుమాన్ జయంతి సందర్భంగా.. హైదరాబాద్లోని ఈ రూట్లో ట్రాఫిక్ ఆంక్షలు

హనుమాన్ జయంతి సందర్భంగా.. హైదరాబాద్లోని ఈ రూట్లో ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్: ఏప్రిల్ 12న (శనివారం) హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్ పోలీసులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ట్రాఫిక్ ఆంక్షలు ఉదయం 11 నుంచి 8 రాత్రి 8 గంటల వరకూ అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు. హనుమాన్ జయంతి సందర్భంగా గౌలిగూడ ‘రామ్ మందిర్’ నుంచి మొదలయ్యే హనుమాన్ శోభా యాత్ర తాడ్బండ్ హనుమాన్ మందిర్ దగ్గర ముగుస్తుంది.

హనుమాన్ శోభాయాత్ర గౌలిగూడ ‘రామ్ మందిర్’ నుంచి మొదలై.. పుత్లిబౌలి క్రాస్ రోడ్స్, ఆంధ్రా బ్యాంక్ క్రాస్ రోడ్స్, కోఠి, సుల్తాన్ బజార్ క్రాస్ రోడ్స్, రామ్‌కోఠి క్రాస్ రోడ్స్, కాచిగూడ క్రాస్ రోడ్స్, నారాయణగూడ వైఎంసీఏ, చిక్కడపల్లి క్రాస్ రోడ్స్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, అశోక్ నగర్, గాంధీ నగర్ బ్యాక్ సైడ్ వైశ్రాయ్ హోటల్, ప్రాగా టూల్స్, కవాడిగూడ, సీజీవో టవర్స్, బన్సీలాల్‌పేట రోడ్, బైబిల్ హౌస్, సిటీ లైట్ హోటల్, బాటా షోరూమ్, ఉజ్జయిని మహంకాళి టెంపుల్, ఓల్డ్ రామ్‌గోపాల్‌పేట రోడ్, ప్యారడైజ్ క్రాస్ రోడ్స్, సీటీవో జంక్షన్, లీ రాయల్ ప్యాలెస్, బ్రూక్ బాండ్, ఇంపిరీయల్ గార్డెన్, మస్తాన్ కేఫ్ మీదుగా తాడ్‌బండ్‌లోని హనుమాన్ మందిర్కు చేరుకుంటుంది.

దీంతో.. ఈ మార్గంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7 గంటల మధ్యన ప్రయాణించే వాళ్లకు పోలీసులు ప్రత్యామ్నయ రూట్లను సూచించారు. లక్డీ కాపూల్ నుంచి సికింద్రాబాద్ స్టేషన్, ఉప్పల్ వైపు ప్రయాణించే వాహనదారులు వీవీ స్టాచ్యూ, సోమాజిగూడ, గ్రీన్ ల్యాండ్స్, బేగంపేట్ ఫ్లై ఓవర్, ప్రకాశ్ నగర్ ఫ్లై ఓవర్, ప్యారడైజ్ ఫ్లై ఓవర్ మీదుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకోవాలని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. మొత్తం 10 కిలోమీటర్ల మేర ‘హనుమాన్ శోభా యాత్ర’ సాగనుంది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో శనివారం ఐపీఎల్ మ్యాచ్ కూడా జరగనుంది.