హైదరాబాద్ : ముంభై కేంద్రంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్న 18 మంది సైబర్ క్రిమినల్స్ ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు సిబిఐ, ఈడి, డ్రగ్స్ పేరు చెప్పి అమాయకులైన ప్రజల్ని భయపెట్టి కోట్లు వసూళ్లు చేశారు. ఒక్క హైదరాబాద్ ప్రాంతం నుంచే రూ.7 కోట్లు వరకు కొట్టేశారు. అరెస్ట్ చేసిన 18 మందిపై ఇప్పటివరకు మొత్తం 435 కేసులు నమోదైయ్యాయి ఉన్నాయి. పోలీసులు రూ.కోటికి పైగా నగదును వివిధ బ్యాంక్ అకౌంట్లో ఫ్రిజ్ చేశారు.
సిబిఐ, ఈడి , డ్రగ్స్ కేసుల పేర్లు చెప్పి ఫేక్ కాల్స్ చేసి బాధితుల నుంచి డబ్బులు గుంజారు. ఫేక్ డీపీలు పెట్టి వాట్సాప్ కాల్స్ చేసి.. వివిధ కేసుల్లో బుక్ చేస్తామని భయపెట్టి లక్షల్లో డబ్బులు వసూళ్లు చేసేవారు. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ కి స్పందించవద్దని హైదరాబాద్ సిపి సీవీ ఆనంద్ ప్రజలకు సూచించారు. సైబర్ నేరగాళ్లు చెప్పే మాయమాటలు ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దని ఆయన కోరారు.