
హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ లో 144 సెక్షన్ విధించారు. ఈ మేరకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. సిటీలో తక్షణమే 144 సెక్షన్ అమల్లోకి వస్తుందని.. జూన్ 6 వరకు అమల్లో ఉంటుందన్నారు. గ్రేటర్ పరిధిలో పబ్లిక్ కు అంతరాయం కల్గకుండా శాంతి భద్రతలను కాపాడడమే తమ లక్ష్యమన్నారు.
144 సెక్షన్ ప్రకారం ఎన్నికల సమయంలో లైసెన్స్ డ్ ఆయుధాలను కలిగి ఉండకూడదు. అలాగే ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు కొత్త గన్ లైసెన్సుల జారీ నిలిపివేయబడుతుంది. అభ్యర్థులకు మద్దతుగా రాజకీయ ర్యాలీలు లేదా సమావేశాల సమయంలో గన్ లను ఉపయోగించకూడదు. మే 13న హైదరాబాద్‌లో తెలంగాణ లోక్ సభ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది.జూన్ 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.