పోలీస్ అలర్ట్ : గణేష్ నిమజ్జనం రోజు పాటించాల్సిన నిబంధనలు

హైదాబాద్ లో  సెప్టెంబర్ 28న జరిగే గణేశ్ నిమజ్జనం కోసం జీహెచ్ఎంసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక  గణేష్ నిమజ్జనం సందర్భంగా ఈవెంట్ నిర్వాహకులు, వాలంటీర్లు పాటించాల్సిన భద్రతా చర్యలపై సిటీ పోలీసులు గైడ్ లైన్స్ రిలీజ్ చేశారు.   నిమజ్జనం సమయంలో  ప్రమాదాలను నివారించడానికి ఈ నియమాలను రిలీజ్ చేశారు.

నిమజ్జనం రోజున పాటించవలసిన నియమాలు

  • గణేష్ ఉత్సవ సమితి సభ్యులు గణపతి విగ్రహాలను తీసుకు వెళ్లడానికి రవాణా వాహనాలను ముందుగానే సిద్ధం చేసుకోమని నిర్వాహకులకు తెలియజేయాలి.
  • నిమజ్జనం రోజున విగ్రహాలను తీసుకు వెళ్లే వాహనాలు వీలైనంత త్వరగా ప్రారంభం కావాలి. ఒక్క గణపతి విగ్రహానికి ఒక వాహనం మాత్రమే అనుమతించబడుతుంది.
  •  నిమజ్జనం రోజున వాహనాలపై DJ తో కూడిన మ్యూజికల్ సిస్టమ్ న్ను ఉపయోగించొద్దుె
  • ఊరేగింపు సమయంలో బాణాసంచా ఉపయోగించరాదు. నిమర్జనం కోసం తీసుకువెళ్లే వాహనంలో మద్యం లేదా మరేదైనా మత్తుపదార్థాల మత్తులో ఉన్న వ్యక్తులను అనుమతించకూడదు..
  • విగ్రహాన్ని తీసుకు వెళ్లే వాహనం ఇతర వాహనాలకు లేదా ట్రాఫిక్ కు అడ్డంకిని కలిగించకూడదు.
  • నిమజ్జన ఉరేగింపులో  వాహనం పై నుండి ఇతరుల మీద రంగులు గాని పువ్వులు గాని, నీళ్ల ప్యాకెట్లను గాని చెయ్యకుండా నిర్వాహకులు తగు జాగ్రత్తలు తీసుకొవాలి.

         ALSO READ : IND vs AUS: శభాష్ అనిపించుకున్న రాహుల్.. 27 ఏళ్ల చరిత్రలో తొలి విజయం

  • విగ్రహాన్ని తీసుకువెళ్లే వాహనాన్ని ఎటువంటి ప్రార్థనా స్థలం దగ్గర గాని, జంక్షన్ ల వద్ద గాని ఆపకూడదు.
  • ఊరేగింపులో ఎవరూ కర్రలు, కత్తులు, పేలుడు పదార్థాలు లేదా ఇతర ఆయుధాలు కల్గి ఉండకూడదు.
  •  రెచ్చగొట్టే నినాదాలు చేయడం, పాటలు ప్లే చేయడం చేయకూడదు,
  • సోషల్ మీడియా,  వాట్సాప్  ద్వారా వచ్చే పుకారులను నమ్మవద్దు.. వాటిని ఎట్టి పరిస్థితులలో ఇతరులకు ఫార్వర్డ్ చేయవచ్చు. అలాంటి పుకార్లను తమ వాట్సాప్ నంబర్ 9490616553  ద్వారా హైదరాబాద్ సిటీ పోలీస్ కి తెలియపరచవలెను.