కౌశిక్ రెడ్డికి పోలీసుల నోటీసులు

  • బంజారాహిల్స్‌‌‌‌ సీఐ విధులకు ఆటంకం కలిగించిన కేసు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి మాసబ్ ట్యాంక్‌‌‌‌ పోలీసులు నోటీసులు జారీ చేశారు. గురువారం ఉదయం తమ ముందు విచారణకు హాజరుకావాల్సిందిగా పేర్కొన్నారు. అయితే, కరీంనగర్‌‌‌‌ కోర్టులో హాజరుకావాల్సి ఉందని, గురువారం విచారణకు రాలేనని పోలీసులకు కౌశిక్‌‌‌‌రెడ్డి సమాచారం ఇచ్చారు. శుక్రవారం ఉదయం అటెండ్‌‌‌‌ అవుతానని తెలిపారు. తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారంటూ ఫిర్యాదు చేయడానికి వచ్చిన సమయంలో బంజారాహిల్స్‌‌‌‌ పోలీస్ స్టేషన్ ఇన్‌‌‌‌స్పెక్టర్‌‌‌‌‌‌‌‌ రాఘవేంద్ర విధులకు కౌశిక్ రెడ్డి ఆటంకం కలిగించారు.  ఈ కేసులో మాసబ్ ట్యాంక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.