సీఐడీ, ఈడీ ఆఫీసర్లమంటూ బెదిరించి డబ్బులు మళ్ల చేసిన అంతరాష్ట్ర ముఠా పోలీసులకు చిక్కింది.. అమాయకులకు మాయమాటలు చెప్పి ఆన్లైన్లో ఫోన్లు చేసి, లక్షలు, కోట్లలో కొట్టేసిన సైబర్ నేరగాళ్లు చివరకు కటకరాలపాలయ్యారు. దేశవ్యాప్తం గా సెక్స్ టార్షెన్, కొరియర్, పెట్టుబడి పేరుతో మోసాలకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ఈ స్పెషల్ ఆపరేషన్లో మొత్తం 18మంది సైబర్ కేటుగాళ్లను అరెస్టు చేశారు పోలీసులు. నిందితుల బ్యాంకు ఖాతాల్లోని రూ.1.61 కోట్ల నగదును సీజ్ చేశారు పోలీసులు. కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, హైదరాబాద్ పోలీసులు సైబర్ క్రైమ్ ఆపరేషన్ చేపట్టారు. ఆరు ప్రత్యేక టీమ్స్ గా ఏర్పడి గాలింపు చేపట్టారు. ఈ మేరకు హైదరాబాద్ సీపీ ఆనంద్ మీడియాకు వెల్లడించారు.
ఈ ఆపరేషన్లో మొత్తం 18మంది సైబర్ నేరగాళ్ళను అరెస్టు చేశామని.. వీరిపై దేశవ్యాప్తంగా 319 కేసులు నమోదు కాగా.. మన రాష్ట్రంలో 45కేసులు నమోదయ్యాయని తెలిపారు. నిందితుల నుంచి రూ.5 లక్షల క్యాష్, 26 సెల్ ఫోన్లు, 16 ఏటీఏం కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ALSO READ | మెరీనా బీచ్‌లో ఘనంగా ఐఏఎఫ్ ఎయిర్ షో
నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించామని.. తెలంగాణాలో నమోదైన కేసుల్లో బాధితుల నుంచి ఈ కేటుగొళ్లురూ.6.94 కోట్లు కాజేశారని సీపీ ఆనంద్ తెలిపారు. సైబర్ నేరగాళ్ల విషయంలో అందరు అప్రమత్తంగా ఉండాలని సీపీ ఆనంద్ తెలిపారు.
అమాయకులను టార్గెట్ చేస్తూ కేటుగాళ్లు కొత్తరకంగా మోసాలకు పాల్పడుతున్నారని... కేటుగాళ్లు చెప్పే మాటలు ఎట్టి పరిస్థితిల్లో నమ్మొద్దని అన్నారు. ఆగంతుకుల ఫోన్ కాల్స్ కు స్పందించద్దని.. ఇటువంటి ఫోన్ కాల్స్ కట్ చేయాలని.. ఫోన్ కాల్స్ లో బెదిరిస్తే ఆందోళన చెందకుండా పోలీసులకు సమాచారం ఇవ్వాలని అన్నారు.