హైదరాబాద్ లో ఉత్సాహంగా ‘రన్​ ఫర్​ యాక్షన్’​

హైదరాబాద్ లో ఉత్సాహంగా ‘రన్​ ఫర్​ యాక్షన్’​

సిటీ పోలీస్​ కమిషనరేట్ ​పరిధిలో 18 వేల మంది సిబ్బంది పనిచేస్తుండగా, వీరిలో 30% మంది మహిళలు ఉన్నారని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. శనివారం విమెన్స్​ డే సందర్భంగా నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా నుంచి 5 వేల మందితో రన్ ఫర్ యాక్షన్ పేరిట 5కె, 2కె రన్ నిర్వహించారు. మంత్రి సీతక్క, సీపీ ఆనంద్ పాల్గొని ప్రారంభించారు.