తెలంగాణలో డీజేలపై నిషేధం?

తెలంగాణలో డీజేలపై నిషేధం?
  • సౌండ్ పొల్యూషన్ అరికట్టేందుకు సర్కార్ చర్యలు
  • సీవీ ఆనంద్ నేతృత్వంలో విధి విధానాల రూపకల్పన
  • డీజేల సౌండ్స్​పై భారీగా పెరిగిన ఫిర్యాదులు
  • ప్రజా ప్రతినిధులు, మత పెద్దలతో హైదరాబాద్ సీపీ సమావేశం
  • డీజేల నియంత్రణపై చర్చ
  • భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన ప్రజాప్రతినిధులు
  • త్వరలో ప్రభుత్వానికి నివేదిక ఇస్తామన్న సీవీ ఆనంద్

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు:  సౌండ్ పొల్యూషన్​తో ప్రజల ప్రాణాలకు హాని కలిగిస్తున్న డీజేలపై నిషేధం విధించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఈ మేరకు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ నేతృత్వంలో విధి విధానాల రూపొందిస్తున్నది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా డీజేల నిర్వహణపై ఆంక్షలు ఉన్నాయి. కానీ.. ఎక్కడా ఇవి అమలు కావడం లేవు. చాలా చోట్ల అనధికారికంగా డీజేలు పెడ్తున్నారు. డీజేల కారణంగా వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ పోలీసులకు ఫిర్యాదులు పెరిగిన నేపథ్యంలో వాటిపై నిషేధం విధించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మూడు కమిషనరేట్ల పోలీసులు, ప్రజా ప్రతినిధులు, డీజే నిర్వాహకులతో బంజారాహిల్స్​లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్​లో సీవీ ఆనంద్ గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. గణేష్ ఉత్సవాలు, మిలాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నబి సహా ఇతర పండుగల నేపథ్యంలో డీజేల కారణంగా తలెత్తుతున్న సమస్యలపై చర్చించారు. ఈ సమావేశానికి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి, ఖైరతాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు, హైదరాబాద్ కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అనుదీప్ దురుశెట్టి, జీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, ఎంఐఎం, ఎంబీటీ నేతలతో పాటు హిందూ, ముస్లిం, సిక్కు మత పెద్దలు హాజరయ్యారు. 

మత్తులో గంటల తరబడి డ్యాన్స్ చేస్తున్నరు: సీపీ

గడిచిన పదేండ్లలో డీజేల వాడకం భారీగా పెరిగిందని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ అన్నారు. ‘‘మహారాష్ట్రలో డీజేలపై నిషేధం అమల్లో ఉంది. అందుకే తక్కువ ధరకు హైదరాబాద్​కు వచ్చి డీజేలు పెడ్తున్నరు. వినాయక ఉత్సవాల్లోనే కాకుండా.. ఫంక్షన్ హాల్స్, ఇండ్లల్లో, చిన్న చిన్న ఫంక్షన్లలో డీజేలు వాడుతున్నరు. గణేష్ ఉత్సవాలు, మిలాద్ ఉన్ నబీ ర్యాలీల సందర్భంగా గతంలో కంటే ఈ ఏడాది డయల్ 100కు వచ్చిన డీజే ఫిర్యాదులు 500శాతం పెరిగాయి. డీజే సౌండ్స్ కారణంగా పిల్లలు చదువుకోలేకపోతున్నారని.. వృద్ధుల గుండె ఆగిపోయేలా ఉందంటూ కంప్లైంట్​లు వచ్చాయి. పోలీసులు అక్కడికెళ్లిన తర్వాత కొద్దిసేపు ఆఫ్ చేసి మళ్లీ సౌండ్స్ పెంచుతున్నరు’’అని సీవీ ఆనంద్ అన్నారు. డ్రగ్స్, గంజాయి మత్తులో యువత గంటల తరబడి డ్యాన్స్ చేస్తున్నారని తెలిపారు. ‘‘డీజేలు ఉన్న ర్యాలీల బందోబస్తుకు వెళ్లాలంటే పోలీసులు భయపడ్తున్నరు. వయస్సు పైబడిన హెడ్ కానిస్టేబుళ్లు గుండెపోటు వస్తుందని అంటున్నరు. డీజేలు, పటాకుల నియంత్రణపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది’’అని సీవీ ఆనంద్ అన్నారు. ప్రజా ప్రతినిధులు, మత పెద్దలు, ఉత్సవ సమితీలు, డీజే నిర్వాహకుల సలహాల మేరకు నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు. 

పొలిటికల్​గా ఉంటది.. రిలీజియన్​కు వద్దా? 

రాజకీయ పార్టీల మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు డీజేలు పెడ్తున్నరు. మత పరమైన ఉత్సవాలకు, ఊరేగింపులకు డీజేలపై నిషేధం అనేది కరెక్ట్ కాదు. దీపావళి ఒక్క రోజే టపాసులు కాలుస్తం. దీంతో కాలుష్యం పెరుగుతున్నదని ప్రచారం చేస్తున్నరు. డీజేలపై నియంత్రణ అవసరమే. చట్ట ప్రకారం ఎన్ని డెసిబుల్స్ సౌండ్ ఉండాలో దాని ప్రకారం ముందుకు వెళ్లాలి.– భగవంత రావు, భాగ్యనగర్  గణేష్ ఉత్సవ సమితి, ప్రధాన కార్యదర్శి

డీజే నిర్వాహకులకు ప్రత్యామ్నాయం చూపించాలి

హైదరాబాద్ సిటీలో ఏవైనా ఉత్సవాలు జరిగితే డీజే పెట్టుకుంటామని పబ్లిక్ నుంచి మాపై ఒత్తిడి ఉంటున్నది. పోలీసులకు చెప్పి పర్మిషన్ ఇప్పించాలని నిర్వాహకులు కోరుతుంటారు. డీజేల నిర్వహణపై కండీషన్స్ పెట్టాలి. వీటిపై ఆధారపడిన కుటుంబాలకు ప్రత్యామ్నాయం చూపించాలి.
– అనిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యాదవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎంపీ

డీజేలపై నియంత్రణ మంచి నిర్ణయం

అన్ని మతాల వాళ్లు ఊరేగింపులు, ఉత్సవాల టైమ్​లో డీజేలు వాడుతున్నారు. పోటాపోటీగా డీజే సౌండ్స్ పెడ్తున్నరు. కొన్నేండ్ల నుంచి వీటి వాడకం బాగా పెరిగిపోయింది. భారీ ఎత్తున సౌండ్స్ పెట్టడంతో గుండె ఆగి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటది. డీజేల నియంత్రణ అనేది మంచి నిర్ణయం. డీజే పెట్టిన ప్రాంతాలకు ప్రజా ప్రతినిధులు కూడా వెళ్లమని చెప్పాలి.
- దానం నాగేందర్, ఎమ్మెల్యే, ఖైరతాబాద్ 

డీజేలు పెట్టి తీరుతం 

డీజేలపై నిషేధం విధించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తున్నది. ఇది సరైన నిర్ణయం కాదు. డీజేల కారణంగా ఇప్పటి దాకా ఎక్కడా గొడవలు, అపశృతులు జరగలేవు. హిందూ పండుగలను టార్గెట్ చేసి డీజే, టపాసులు బ్యాన్ చేయాలని చూస్తున్నరు. దేవి నవరాత్రులు, దసరా, దీపావళి, సంక్రాంతి పండుగలు వస్తున్నయ్. డీజేలు పెట్టి తీరుతం. సౌండ్ లాకింగ్ పెట్టండి.
- రాజాసింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎమ్మెల్యే, గోషామహల్

ఇస్లాం సూత్రాలకు విరుద్ధం

మిలాద్ ఉన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నబి ఇతర ర్యాలీల్లో డీజే, టపాసులు పేల్చడం ఇస్లాం సూత్రాలకు విరుద్ధం. గతంలో ఎన్నడూ లేని విధంగా యువత వ్యవహరించింది. మత పెద్దలతో చర్చిస్తాం. ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా చర్యలు తీసుకుంటాం. పోలీసులకు అన్ని విధాలుగా సహకరిస్తాం.
– సుతారి, ముస్లిం మత పెద్ద