బ్రాండెడ్ పేరుతో నకిలీ గుడ్​నైట్,​ ఫెవి క్విక్

బ్రాండెడ్ పేరుతో నకిలీ గుడ్​నైట్,​ ఫెవి క్విక్

బషీర్ బాగ్,వెలుగు :  మార్కెట్ లో పేరున్న ప్రొడక్ట్స్​ల పేరు మీద నకిలీ వస్తువులు అమ్ముతున్న ముగ్గురు వ్యాపారులను సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. బేగంబజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్ఎమ్ జనరల్ స్టోర్, శ్రీ సరోజ్ ఏజెన్సీ , శ్రీ ట్రేడర్స్ లో నకిలీ ప్రొడక్ట్స్​అమ్ముతున్నట్టు పోలీసులకు రావడంతో ఆయా స్టోర్స్ పై టాస్క్ ఫోర్స్ పోలీసులు రైడ్స్ చేశారు. 

ఈ దాడుల్లో బ్రాండెడ్ పేరుతో ఉన్న నకిలీ గుడ్ నైట్ మస్కిటో లిక్విడ్స్ బాక్స్ లు , గుడ్ నైట్ లిక్విడ్ కాయిల్స్ , లైజల్ సర్ఫేస్ లిక్విడ్ బాటిల్స్, ఫెవిక్విక్ షీట్స్ ఉన్నాయి. వీటి విలువ రూ. 2 లక్షలు ఉంటాయని తెలిసింది. వీటిని అమ్ముతున్న నిర్వాహకులు రమేశ్​కుమార్ పర్మర్ , హితేశ్​పవార్ , రమేష్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు. వారిని బేగంబజార్ పోలీసులకు అప్పగించారు.