హైదరాబాద్ చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. గుల్మోహర్ పార్క్ లోని ఓ వైద్యుడి ఇంట్లో డ్రగ్స్ పార్టీకి ప్లాన్ చేశారు నిందితులు. పక్కా సమాచారంతో ఆ ఇంటి పై దాడులు జరిపిన నార్కోటిక్ డ్రగ్స్ కంట్రోల్ అధికారులు....రాజస్థాన్ నుంచి డ్రగ్స్ తెచ్చి హైదరాబాద్ ల విక్రయిస్తున్నట్లు గుర్తించారు.
ఘటనా స్థలంలో 18 లక్షల విలువ చేసే 150 గ్రాముల MDMA డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ కేసులో ఒకరిని అదుపులోకి తీసుకోగా మరో ఐదుగురు పరారీలో ఉన్నట్లు సమాచారం. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు చందానగర్ పోలీసులు.