హైదరాబాద్ లో 17 కిలోల గంజాయి సీజ్

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఒడిశా నుంచి హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రైల్లో గంజాయి సరఫరా చేస్తున్న వ్యక్తిని ఎస్టీఎఫ్ టీమ్ అరెస్ట్ చేసింది. మల్కాజిగిరి రైల్వే స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సంచులతో సహా రైలు దిగిన వ్యక్తిని పక్కా సమాచారంతో శుక్రవారం పట్టుకున్నారు.

అతడి నుంచి 17.22 కిలోల సరుకును స్వాధీనం చేసుకున్నారు. రాజమండ్రికి చెందిన ఎస్​కె అహ్మద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అలీ ధూల్​పేటకు చెందిన రాహుల్​సింగ్​కు ఈ గంజాయిని ఇవ్వడానికి తీసుకొచ్చినట్లు గుర్తించారు.