బాడీ బిల్డర్స్ టార్గెట్.. భారీగా స్టెరాయిడ్స్ అమ్మకాలు.. రూ. 2 లక్షల స్టాక్ సీజ్ చేసిన పోలీసులు

బాడీ బిల్డర్స్ టార్గెట్.. భారీగా స్టెరాయిడ్స్ అమ్మకాలు.. రూ. 2 లక్షల స్టాక్ సీజ్ చేసిన పోలీసులు

యువతలో బాడీ బిల్డింగ్ పై మోజు ఉన్నోళ్లు చాలామంది ఉంటారు. అయితే.. సిస్టమాటిక్ గా బాడీ పెరగాలంటే చాలా టైం పడుతుంది. దీంతో త్వరగా బాడీ పెంచాలన్న ఆలోచనతో స్టెరాయిడ్స్ ని ఆశ్రయిస్తున్నారు చాలామంది. ఈ వీక్నెస్ ని క్యాష్ చేసుకునేందుకు కొందరు కేటుగాళ్లు నిషేధిత స్టెరాయిడ్స్ ను అమ్ముతున్నారు. హైదరాబాద్ లాంటి నగరాల్లో ఈ దందా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో హైదరాబాద్ లో గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న నిషేధిత స్టెరాయిడ్స్ అమ్మకాలపై ఉక్కుపాదం మోపారు పోలీసులు. 

హైదరాబాద్ లోని హుమయిన్ నగర్ లో అక్రమంగా సేకరించి అమ్మకాలు చేస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు.పక్కా సమాచారంతో దాడులు చేసిన పోలీసులు నిందితులు మహమ్మద్ నజీర్, సంజీవ్, ఇమ్రాన్ ఖాన్ లను అరెస్ట్ చేశారు. నిందితుల నుండి 1.80లక్షల విలువగల 23రకాల స్టెరాయిడ్స్ సీజ్ చేశారు పోలీసులు.

ఈ నిషేధిత స్టెరైడ్స్ కి మార్కెట్లో భారీ డిమాండ్ ఉన్నట్లు తెలిపారు పోలీసులు. ఇంజక్షన్స్, టాబ్లెట్స్, క్యాప్సల్ రూపంలో కండరాల పెరుగుదలకు స్టెరాయిడ్స్ అమ్ముతున్నట్లు తెలిపారు పోలీసులు.