
జూబ్లీహిల్స్, వెలుగు: గంజాయి అమ్ముతున్న ముగ్గురిని మధురానగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఒడిశాలోని కోరాపుట్‌కు చెందిన బల హంథల్ అడ్డదారిలో సిటీకి గంజాయిని తీసుకొచ్చి కూకట్ పల్లికి చెందిన బుర్రా శ్రీనివాసులు(24), గోనుగుంట అభిషేక్(21) ద్వారా అమ్మకాలు చేస్తున్నాడు.
బుధవారం వెంగళరావునగర్‌లోని నలంద స్కూల్‌వద్ద గ్రౌండ్లో ఉన్న వీరిని మధురానగర్ పోలీసులు పక్కా సమాచారంతో అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 41 కేజీల గంజాయి, రూ.40 వేల నగదు, ప్యాకింగ్ మెటీరియర్, ఒక డ్యూక్ బైక్ స్వాధీనం చేసుకున్నట్లు ఇన్స్పెక్టర్ జి.శ్రీనివాస్ తెలిపారు.