బోణీ అయ్యింది : హైదరాబాద్ లో ఓటర్లకు పంచే కుక్కర్లు పట్టివేత

బోణీ అయ్యింది : హైదరాబాద్ లో ఓటర్లకు పంచే కుక్కర్లు పట్టివేత

తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు.  హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, గచ్చిబౌలి, పంజాగుట్టతో పాటుగా  పలు ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు.  వాహనాలను ఎక్కడికక్కడ ఆపి తనిఖీలు చేస్తున్నారు.  ఈ క్రమంలో గచ్చిబౌలిలో భారీగా కుక్కర్లు స్వాధీనం చేసుకున్నారు.

ALSO READ : అతిపెద్ద హిందూ దేవాలయంపై అక్షయ్ కుమార్ ప్రశంసలు

 ఓటర్లకు పంచేందుకు సిద్ధంగా ఉంచిన 87 కుక్కర్లను సీజ్‌  చేశారు.  కుక్కర్లపై శేరిలింగంపల్లి కాంగ్రెస్‌ నేత రఘునాథ్‌ స్టిక్కర్‌లు గుర్తింపు ఉంది. కారుకు నంబర్‌ ప్లేటు లేకపోవడంతో పోలీసులు  కేసు నమోదు చేశారు.   కుక్కర్లు పంచుతున్న రాములు నాయక్, నర్సింహా అనే వ్యక్తులను  పోలీసులు అరెస్ట్ చేశారు.  

మరోవైపు  వనస్థలిపురంలో నాలుగు లక్షల రూపాయలను పోలీసులు   సీజ్ చేశారు.   ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో డబ్బు, మద్యం  తరలింపుపై పోలీసులు నగరంలో గట్టి ఫోకస్  పెట్టారు.