అయ్యయ్యో వద్దమ్మా..సుఖీభవ!.. అలాంటి లింక్స్ ఓపెన్ చేయొద్దు 

హైదరాబాద్: గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో 'సుఖీభవ' అనే వీడియో ఒకటి విపరీతంగా వైరల్ అవుతోంది. నల్లగుట్ట శరత్ అనే అబ్బాయి ఓ టీ పౌడర్ యాడ్‌‌ను రీక్రియేట్ చేసి జోరుగా తీన్మార్ స్టెప్పులేయడం, అది కాస్త మీమ్స్ పేజీల ద్వారా ఇంటర్నెట్‌లో వైరల్ అయింది.  ఈ నేపథ్యంలో నేరాల గురించి ప్రజలను అప్రమత్తం చేయడానికి మీమ్స్, వైరల్ ఫొటోలను వాడే హైదరాబాద్  సిటీ పోలీసులు ఈ యాడ్‌ను కూడా వినియోగించారు. ఈమధ్య ప్రైజ్ మనీ గెలిచారంటూ లింకులు పంపుతూ ఆన్‌లైన్ మోసాలకు పాల్పడే వారు ఎక్కువయ్యారు. అందుకే ఇలాంటి మోసాలకు పాల్పడే వాళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలను హెచ్చరిస్తూ సుఖీభవ అంటూ హైదరాబాద్ సిటీ పోలీసులు ఈ మీమ్‌‌ను వాడేశారు. అలాంటి లింక్స్ ఓపెన్ చేయకండి అంటూ ఒరిజినల్ యాడ్‌‌ స్క్రీన్ షాట్‌ను ఉపయోగించారు.

మరిన్ని వార్తల కోసం: 

నేను జనంలో ఒకడ్ని.. వెయ్యి మందితో సెక్యూరిటీ అవసరమా?

గర్భిణులకు కరోనా వ్యాక్సిన్​.. పుట్టబోయే పిల్లలకు యాంటిబాడీలు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ను రాత్రికి రాత్రే విశ్వనగరం చేయలేం