Hyderabad: ఉప్పల్ రింగ్ రోడ్ వైపు వెళ్లే పనుంటే ఈ లేటెస్ట్ అప్డేట్ మీకోసమే..!

హైదరాబాద్: ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద మల్కాజ్గిరి ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వాహనాలను విస్తృతంగా తనిఖీలు చేశారు. నెంబర్ ప్లేట్లు సరిగా లేని వాహనాలను ఆపి ట్రాఫిక్ ఛలాన్లు వేసి వాహనదారులకు ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస రావు, ఉప్పల్ ట్రాఫిక్ ఎస్హెచ్ఓ లక్ష్మి మాధవి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద జరుగుతున్న తనిఖీలలో నెంబర్ ప్లేట్లు సరిగా లేనటు వంటి సుమారు 95 ద్విచక్ర వాహనాలను, ఐదు కార్లను పట్టుకొని ఛలాన్లు వేసినట్లు తెలిపారు.

ALSO READ | అది ఫేక్ న్యూస్ నమ్మకండి.. ఒంటరి మహిళలకు వాహనంపై సిటీ పోలీసుల క్లారిటీ

వాహనదారులు ప్రతి ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, వాహనానికి సంబంధించిన పత్రాలతో పాటు వారి నెంబర్ ప్లేట్లు సరిగా ఉండాలని, ఇన్సూరెన్స్,  లైసెన్స్, సీట్ బెల్ట్, హెల్మెట్ తప్పక కలిగి ఉండాలని స్పష్టం చేశారు. నెంబర్ ప్లేట్లు మార్పిడి చేసి నడిపిస్తున్నటు వంటి వాహనాలపై కఠిన చర్యలు ఉంటాయని ఏసీపీ హెచ్చరించారు.