Cyber Crime Alert: ఫెడెక్స్ కొరియర్ పేరుతో కాల్స్ .. బ్లాక్మెయిల్ చేసి డబ్బులు కాజేస్తారు..

Cyber Crime Alert: ఫెడెక్స్ కొరియర్ పేరుతో కాల్స్ .. బ్లాక్మెయిల్ చేసి డబ్బులు కాజేస్తారు..

FedEx  కొరియర్ నుంచి మాట్లాడుతున్నాం అంటూ కాల్స్ చేస్తారు. నిజంగానే FedEx సిబ్బందే అన్నట్లుగా నమ్మిస్తారు. మీకు ఆధార్ నెంబర్ తో పార్సిల్ వచ్చింది. అందులో అక్రమంగా రవాణా చేస్తున్న మాదక ద్రవ్యాలున్నాయని బాధితుడిన భయపెడతారు. చట్టరీత్యా కఠిన శిక్షలు ఉంటాయని వారిని మరింత భయాందోళనకు గురి చేస్తారు. అంతే బాధితులు మానసికంగా లొంగిపోగానే బ్లాక మెయిల్ చేస్తారు. బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తారు. ఇలాంటి సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలంటున్నారు పోలీసులు, అటు ప్రభుత్వాదలు. దేశంలో సైబర్ మోసాలు పెరుగుతున్న క్రమంలో హైదరాబాద్ పోలీసులు నకిలీ ఫెడెక్స్ కొరియర్ కాల్స్ గురించి హెచ్చరికలు జారీ చేశారు. గతంలో ఈ కుంభకోణం వల్ల చాలా  మంది బాధితులు కోట్లాది రూపాయలు నష్ట పోయారు. 

నకిలీ ఫెడెక్స్ కొరియర్ కాల్స్ తో  ప్రజలను ఎలా మోసం చేస్తారంటే..

రోజురోజుకు పెరుగుతున్న సైబర్ నేరాల్లో ఈ నకిలీ ఫెడెక్స్ కొరియర్ కాల్స్ ఒకటి. FedEx కొరియర్ మోసగాళ్లు కంపెనీ ఉద్యోగులు, చట్టాన్ని అమలు చేసే అధికారులుగా నటిస్తారు. ఫేక్ కాల్ చేసి ప్రజలను ఆందోళనకు గురి చేస్తారు. స్కామర్లు ఫెడెక్స్, నకిలీ కస్టమ్స్, పోలీసు అధికారులనుంచి ఆటోమోటెడ్ కాల్స్ ను అనుకరించే ఇంటరాక్షన్ వాయిస్  రెస్పాన్స్ (IVR) సిస్టమ్ లను ఉపయోగిస్తున్నారు. విమానాశ్రయం కస్టమ్స్ లో మీ వస్తువుల మధ్య మాదక ద్రవ్యాలను కనుగొన్నట్లు కథనాన్ని అల్లుతారు. చట్టపరమైన శిక్షలను తప్పించు కోవాలంటే  బాధితులు రూ. 1 లక్ష లనుంచి రూ. 10 లక్షల వరకు జరిమానా చెల్లించాలని ఒత్తిడి తెస్తారు. ఈ విషయంపై ఎవరికీ ఫిర్యాదు చేయొద్దని బాధితుడిని భయపెడతారు. 

ఇలాంటి స్కామ్ లు ఇటీవల ముంబైతో పాటు పలు నగరాల్లో జరిగాయి. వీటిపై అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. 

ఫేక్ ఫెడెక్స్ కొరియర్ కాల్స్ పెరగడంతో హైదరాబాద్  పోలీసులు తాజాగా సైబర్ మోసానికి సంబంధించిన వార్నింగ్ ఇచ్చారు. 

తెలియని వారి నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ లను యాక్సెప్ట్ చేయొద్దు 

సైబర్ స్కామ్ లలో నకిలీ ఫెడెక్స్ కొరియర్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండటమే కాకుండా గుర్తు తెలియని వ్యక్తులనుంచి సోషల్ మీడియాలో ఫ్రెండ్స్  రిక్వెస్ట్ లను అంగీకరించడం కూడా ప్రమాదకరమే అంటున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. 

అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఎవరైనా సైబర్ మోసానికి గురైనట్లయితే సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నంబర్ 1930 డయల్ చేయొచ్చు. ఆన్ లైన్  ద్వారా ఫిర్యాదు చేయొచ్చు.