World Cup 2023: పాక్ జట్టుకు భద్రత కల్పించేందుకు హైదరాబాద్ పోలీసులు 'ఓవర్ టైమ్'

దాదాపు ఏడేళ్ల తర్వాత భారత గడ్డపై అడుగుపెట్టిన పాకిస్థాన్ జట్టుకి గ్రాండ్ గా స్వాగతం పలికారు తెలుగు అభిమానులు. వరల్డ్ కప్ షెడ్యూల్ లో భాగంగా పాక్ జట్టు రెండు వారాల పాటు హైదరాబాద్ లోనే ఉండబోతుంది. ఈ నేపథ్యంలో ప్లేయర్లకు భద్రత పరంగా ఎలాంటి సమస్య ఉండదని హైదరాబాద్ పోలీసులు తెలియజేశారు.
 
ఇందుకోసం వీరు "ఓవర్ టైం" చేయనున్నారు. షెడ్యూలులో భాగంగా పాకిస్థాన్ నేడు న్యూజిలాండ్ తో వార్మప్ మ్యాచ్ ఆడనుంది. భద్రత కారణాల దృష్ట్యా ఈ మ్యాచుకి ప్రేక్షకులని అనుమతించడం లేదు. అయితే ఆస్ట్రేలియాతో అక్టోబర్ 3 న జరగబోయే మరో ప్రాక్టీస్ మ్యాచుకు మాత్రం ప్రేక్షకులు ఉంటారు. ఈ మ్యాచ్ కోసం దాదాపు 800 మంది పోలీసు సిబ్బంది అవసరం. కాగా.. పాక్ తమ వరల్డ్ కప్ తొలి రెండు మ్యాచులను రాజీవ్ గాంధీ స్టేడియంలోని ఆడనుంది. 6 న నెదర్లాండ్స్ తో, 10 న శ్రీలంకతో ఈ మ్యాచులు జరుగుతాయి. 

ALSO READ : దొంగలు బాబోయ్ దొంగలు: ప్రాక్టీస్ టైంలో రోహిత్ ఐఫోన్ మాయం
            
ఇక.. స్టేడియం,హోటల్‌లో భద్రతా ఏర్పాట్లపై పాకిస్తాన్ జట్టు పూర్తిగా సంతృప్తి చెందిందని పిసిబి వర్గాలు పేర్కొన్నాయి. చాలా కాలం తర్వాత పాకిస్తాన్ ఇక్కడకు వచ్చినందున, వారు శాంతియుతంగా ఉండేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తునందుకు ధన్యవాదాలు తెలియజేసింది. మొత్తానికి పాకిస్థాన్ జట్టుకి భద్రత కోసం హైదరాబాద్ పోలీసులు "ఓవర్ టైం" చేస్తున్నందుకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.