జీహెచ్ఎంసీ ప్రజావాణికి 149 అర్జీలు.. మేడ్చల్లో 114 .. ఇబ్రహీంపట్నంలో 52

జీహెచ్ఎంసీ ప్రజావాణికి 149 అర్జీలు.. మేడ్చల్లో 114 .. ఇబ్రహీంపట్నంలో 52

హైదరాబాద్​సిటీ, వెలుగు: ప్రజావాణి ఫిర్యాదులను ఆయా విభాగాల అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా శోభన్ రెడ్డి ఆదేశించారు. జీహెచ్ఎంసీ హెడ్డాఫీస్ లో సోమవారం ప్రజల నుంచి ఆమె అర్జీలు స్వీకరించారు. 

మొత్తం 44 అర్జీలు రాగా, అందులో టౌన్ ప్లానింగ్ విభాగానికి 10, ఇంజినీరింగ్ ( మెయింటెనెన్స్) 7, ఎఫ్ఏ సెక్షన్కు 5, శానిటేషన్ 3,  ట్యాక్స్, హెల్త్, అడ్మినిస్ట్రేషన్, హౌసింగ్, ఎలక్ట్రికల్, యూబీడీ విభాగాలకు 2 ఫిర్యాదుల చొప్పున, ఎంటమాలజీ, లేక్స్, అడ్వర్టైజ్మెంట్స్, ఐటీ, స్పోర్ట్స్, విజిలెన్స్, ఎస్టేట్స్ విభాగాలకు ఒకటి చొప్పున ఫిర్యాదులు వచ్చాయి. జీహెచ్ఎంసీ పరిధిలోని ఆరు జోన్లలో మొత్తం 105 అర్జీలు అందాయి. కూకట్ పల్లి జోన్ లో 50, సికింద్రాబాద్ లో 12, శేరిలింగంపల్లిలో 18, చార్మినార్ లో 7, ఎల్బీనగర్ లో 13, ఖైరతాబాద్ జోన్ లో 5 అర్జీలు వచ్చాయి.

మేడ్చల్లో 114 .. ఇబ్రహీంపట్నంలో 52
మేడ్చల్ కలెక్టరేట్: ప్రజావాణి అర్జీలపై చేపట్టిన చర్యలను వివరిస్తూ ఆన్​లైన్​పోర్టల్ లో అప్లోడ్ చేయాలని మేడ్చల్ అడిషనల్ కలెక్టర్ విజయేందర్ రెడ్డి అధికారులకు సూచించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి కలెక్టరేట్కు వచ్చిన ఫిర్యాదుదారుల అర్జీలను డీఆర్ఓ హరిప్రియతో కలిసి ఆమె స్వీకరించారు. సంబంధిత శాఖలకు సంబంధించి మొత్తం 114 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు.

ఇబ్రహీంపట్నం: ప్రజావాణి అర్జీలను పెండింగ్ లో పెట్టొద్దని రంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్​లో సోమవారం ఆమె ప్రజలను అర్జీలు స్వీకరించారు. రెవెన్యూ శాఖ - 21, ఇతర శాఖలకు  31 కలిసి మొత్తం 52 అర్జీలను అధికారులు స్వీకరించారు.