సెమీస్​లో మైసా, కళింగ

సెమీస్​లో మైసా, కళింగ

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌: హైదరాబాద్ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్ (హెచ్‌‌‌‌‌‌‌‌పీజీఎల్‌‌‌‌‌‌‌‌)లో  టీమ్ మైసా, కళింగ వారియర్స్‌‌‌‌‌‌‌‌, టీమ్ ఆల్ఫా, కాంటినెంటల్ వారియర్స్ సెమీఫైనల్ చేరుకున్నాయి. మంగళవారం హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్‌‌‌‌‌‌‌‌లో జరిగిన తొలి క్వార్టర్‌‌‌‌‌‌‌‌ఫైనల్లో టీమ్‌‌‌‌‌‌‌‌ మైసా 50–30తో టూటోరూట్‌‌‌‌‌‌‌‌పై నెగ్గింది. రెండో క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌లో టీమ్‌‌‌‌‌‌‌‌ ఆల్ఫా 45–35తో మీనాక్షి మావెరిక్స్‌‌‌‌‌‌‌‌ను ఓడించింది.

 ఇతర క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో కళింగ వారియర్స్‌‌‌‌‌‌‌‌ 65–15తో రఫ్‌‌‌‌‌‌‌‌ రైడర్స్‌‌‌‌‌‌‌‌, కాంటినెంటల్‌‌‌‌‌‌‌‌ వారియర్స్‌‌‌‌‌‌‌‌ 50–30తో ఎంవైకే స్ట్రయికర్స్‌‌‌‌‌‌‌‌పై గెలిచాయి. ఐదో సీజన్ సెమీఫైనల్స్ వూటీ గోల్ఫ్ కౌంటీలో జరుగుతాయని హెచ్‌‌‌‌‌‌‌‌పీజీఎల్‌‌‌‌‌‌‌‌ పార్ట్‌‌‌‌‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కృష్ణ గూడూరు తెలిపారు.