ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో మూసి నదికి వరద పోటెత్తుతోంది. జంట జలాశయాల్లో హిమాయత్‌సాగర్‌కు తీవ్ర స్థాయిలో వరద వచ్చి చేరుతోంది. సుమారు 3 వేల క్యూసెక్కుల వరద వస్తుండటంతో అప్రమత్తమైన జలమండలి అధికారులు 4 గేట్లు ఎత్తి. 2,750 క్యూసెక్కుల నీటిని మూసీలోకి విడుదల చేస్తున్నారు.
ఉస్మాన్‌సాగర్ నుంచి 852 క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు. ఇదే సమయంలో సిటీ నడిబొడ్డున ఉన్న ముసారం బాగ్బ్రిడ్జీ దగ్గర వరద ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. బ్రిడ్జీని ఆనుకొని వరద పోతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. అదే సమయంలో హుస్సేన్‌సాగర్‌లో భారీ వరద వచ్చి చేరుతోంది.
AsloRead: 66 శాతం ఎన్నారైలు గల్ఫ్ దేశాల్లోనే..
ట్యాంక్‌బండ్‌లో ప్రస్తుతం 513 మీటర్ల నీటి మట్టం ఉంది. వరద ప్రవాహం పెరుగుతున్నందున తూముల ద్వారా నీటిని కిందకి వదులుతున్నారు. నగరంలోని అనేక ప్రాంతాలు ఇప్పటికీ ముంపులో ఉన్నాయి. శివారు ప్రాంతాల సంగతి వేరే చెప్పనక్కర్లేదు.
నిత్యావసరాలు తీసుకోవాలన్నా అడుగు బయట పెట్టే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో ప్రజలు అధికారుల సాయానికి ఎదురు చూస్తున్నారు.