జీడిమెట్ల, వెలుగు: కుత్బుల్లాపూర్ తహసీల్దార్ ఆఫీసుకు తాళం పడిం ది. మూడేండ్లుగా కిరాయి కట్టకపోవ డంతో బిల్డింగు ఓనర్ బుధవారం రాత్రి ఆఫీసుకు తాళం వేశాడు. గురు వారం ఆఫీసుకు వచ్చిన అధికారులకు తాళం కనబడటంతో విషయం బయటకు పొక్కకుండా తాళం పగలగొట్టి లోపలికి వెళ్లారు. ఓనర్‌ను బుజ్జగిద్దామని ఫోన్ చేశారు. ఫోన్ స్విచ్చాఫ్ రావడంతో బిల్డింగ్‌ను కిరాయికి ఇప్పించిన మధ్యవర్తి సాయంతో ఓనర్‌తో మాట్లాడారు. మూడేండ్లుగా రూ.11లక్షల కిరాయి రావాల్సి ఉందని.. ఇప్పడు, రేపు అని తమని వేధించడం ఎంత వరకు కరెక్టని అధికారులను ఓనర్ ప్రశ్నించాడు. ఉన్నతాధికారులతో మాట్లాడి త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామ ని అధికారులు హమీ ఇవ్వడంతో ఓనర్ వెనక్కి తగ్గాడు.
Read More News….