రెయిన్ అలర్ట్: హైదరాబాద్లో పలు చోట్ల వర్షం

రెయిన్ అలర్ట్:  హైదరాబాద్లో పలు చోట్ల వర్షం

హైదరాబాద్ లో మళ్లీ వర్షం  మొదలయ్యింది. సిటీతో పాటు శివార్లలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. రాజేంద్రనగర్, అత్తాపూర్, మైలార్ దేవ్ పల్లి, బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్, కిస్మత్ పూర్, హైదర్ షా కోట్లా, హిమాయత్ సాగర్, నార్సింగి, మణికొండ, కోకాపేట, గండిపేట్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. 

బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్ ఉరుములు, మెరుపులతో భారీ వర్షం పడుతోంది. లక్టీకాపూల్, ట్యాంక్ బండ్, ఖైరతాబాద్, సెక్రటేరియట్ ప్రాంతాల్లోనూ మోస్తరు నుంచి భారీగా వానలు కురుస్తున్నాయి. కూకట్ పల్లిలోని ఎల్లమ్మబండ, షంశిగూడ ప్రాంతాల్లో వానలు పడుతున్నాయి.

ALSO READ | వర్షాకాలం అయిపోయింది.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువే పడిన వాన

 

పలు చోట్ల  వర్షానికి రోడ్లన్నీ జలమయం కాగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.. ఆఫీసుల నుంచి  ఇంటికి వెళ్లే సమయం కావడంతో వాహనదారులు..పాదాచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు..భారీగా కురుస్తున్న వర్షానికి పలు ప్రధాన కూడళ్ల దగ్గర  ట్రాఫిక్ జామ్ అయ్యింది