- పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం
హైదరాబాద్ సిటీ, వెలుగు: తమిళనాడు, పుదుచ్చేరిలో ఏర్పడిన ఫెయింజల్ తుఫాన్ ప్రభావం సిటీపై పడింది. రెండు రోజులుగా నగరంలో మేఘాలు కమ్ముకున్నాయి. ఆదివారం సాయంత్రంలో చిరుజల్లులు పడ్డాయి. మల్కాజిగిరిలో 4.0 మిల్లిమీటర్లు, ఉప్పల్ లో 3.0 మి.మీ, ఖైరతాబాద్ లో 2.0 మి.మీల వర్షం పడింది. గంటకు 6–-10 కి.మీ వేగంతో ఉపరితల గాలులు వీచాయి. తుఫాన్ తీరం దాటడంతో నగరంలో మరో రెండ్రోజులపాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.