హైదరాబాద్‌లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. రెండు రోజులుగా హైదరాబాద్ లో ముసురుపట్టింది. బేగంబజార్, కోఠి, సుల్తాన్‌బజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్‌బాగ్, లిబర్టీ, నారాయణగూడ, హిమాయత్‌నగర్, లక్డీకపూల్, బంజారాహిల్స్, కూకట్ పల్లి వంటి అనేక ప్రాంతాల్లో జులై 18వ తేదీ నుంచి వాన పడుతోంది. ఎడతెరిపిలేని వర్షాల వల్ల ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అత్యధికంగా టోలిచౌకి లో 1.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మియాపూర్ లో 1.5 సెంటీమీటర్లు, జూబ్లీ హిల్స్,బంజారా హిల్స్,హైదర్ నగర్ లో 1.6 సెంటీమీటర్ల వర్షం పడింది. లంగర్ హౌజ్,షేక్ పెట్, మదాపుర్ లో 1.5 సెంటీమీటర్ల వాన కురిసింది. జీడిమెట్ల, అల్వాల్ లో 1.4 సెంటీమీటర్లు, బాలానగర్ ,విజయ నగర్ లో 1.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
కుండపోత వర్షానికి హైదరాబాద్ లోని డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో జీహెచ్ఎంసీకి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. జులై 19వ తేదీ ఉదయం నుంచి సాయంత్రం వరకు 200 లకు పైగా ఫిర్యాదులు వచ్చాయి. డ్రైనేజీలపై పెద్ద ఎత్తున వాటర్ బోర్డ్ కు చేశారు ప్రజలు.