హైదరాబాద్లో భారీ వర్షం.. ఈ ఏరియాల్లో కుండపోతగా కురుస్తుందిగా..!

హైదరాబాద్లో భారీ వర్షం.. ఈ ఏరియాల్లో కుండపోతగా కురుస్తుందిగా..!

కుత్బుల్లాపూర్: హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. కుత్బుల్లాపూర్ పరిసర ప్రాంతాలలో ఆదివారం రాత్రి ఉన్నట్టుండి వర్షం కురిసింది. సుచిత్ర,పేట్ బషీరాబాద్,కొంపల్లి, దుండిగల్, మల్లంపేట్, గండి మైసమ్మ, సూరారం,చింతల్,జీడిమెట్ల, షాపూర్  నగర్,గాజులరామారంలో వర్షం కురుస్తుంది. మియాపూర్, శేరిలింగంపల్లి, పటాన్చెరు, చందానగర్, గచ్చిబౌలి, కొండాపూర్, రాయదుర్గం, మాదాపూర్లో భారీ వర్షం కురిసింది. 

ALSO READ | మెట్రో రైల్ రెండో దశ పనులకు సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్లో ఆదివారం మధ్యాహ్నం నుంచి పొడిగా ఉన్న వాతావరణం సాయంత్రానికి మారిపోయింది. నల్లటి మబ్బులతో నిండిపోయి చీకటి కమ్మేసింది. ఆఫీసుల నుంచి ఇండ్లకు వెళ్లే టైం కావడం, వీకెండ్ అవడంతో పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జాం అయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. ట్రాఫిక్ కారణంగా మెట్రో రైళ్లకు మరింత రద్దీ పెరిగింది.