Video Viral: హైదరాబాద్ RGI ఎయిర్​ పోర్ట్​పైకప్పు లీకేజీ.. టెర్మినల్​లోకి వర్షపు నీరు

Video Viral: హైదరాబాద్ RGI ఎయిర్​ పోర్ట్​పైకప్పు లీకేజీ.. టెర్మినల్​లోకి వర్షపు నీరు

హైదరాబాద్​ లో కుండపోత వర్షం పడింది.  రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి.  ఎక్కడి పడితే అక్కడ ట్రాఫిక్​ జాం.. ఇది భాగ్యనగరంలో సర్వసాధారణం.  అయితే ఇప్పుడు  హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్‌జిఐఎ) టెర్మినల్‌లోకి వరద నీరు చేరింది.

ఈ రోజు ( ఆగస్టు 19)  హైదరాబాద్​ లో మధ్యాహ్నం కుండపోత వర్షం కురిసింది.  దీంతో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్‌జిఐఎ) పైకప్పు లీకై... టెర్మినల్​ లోకి నీరు చేరింది. పై నుంచి నీరు నేలపై పడే వీడియోను ఓ ప్రయాణికుడు వీడియో తీసి సోషల్​ మీడియాలో పోస్ట్​ చేయడంతో వైరల్​ అవుతుంది.  

హైదరాబాద్‌లో సోమవారం మధ్యాహ్నం 1 గంటలకు ...  50 నిమిషాల పాటు వర్షం దంచి కొట్టింది. దాదాపు 35.2 మి.మీ. అందులో 10 నిమిషాల్లో 17 మి.మీ వర్షం కురిసింది,  ఆ సమయంలో  రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం పైకప్పు నుంచి వర్షపు నీరు లీకైంది. ఈ ఘటనకు సంబంధించిన  వైరల్​ అయిన వీడియోలపై స్పందించిన హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ అధికారులు టెర్మినల్ భవనంలో లీకేజీ జరిగిన మాట వాస్తవేనని అంగీకరించారు.

ఎయిర్​ పోర్ట్​ పైకప్పు నుంచి ఇలాంటి ఘటన ఎప్పుడూ జరగలేదని.. మళ్లీ ఇలాంటి ఘటన జరుగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని RGI హైదరాబాద్ విమానాశ్రయంలోని అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి క్షమాణలు కోరుతున్నట్లు తెలిపారు.