స్వచ్ఛ సర్వేక్షణ్ 2020 అవార్డుల ప్రకటన
టాప్ 20లో రాష్ట్రం నుంచీ ఒక్క సిటీ లేదు
ఏపీవి టాప్ టెన్ లో రెండు సిటీలు
విజయవాడకు 4.. విశాఖపట్నానికి 9వ ర్యాంకు
‘సిటిజన్ ఫీడ్ బ్యాక్ ’లో మెగాసిటీగా హైదరాబాద్
స్వచ్ఛ రాష్ట్రాల జాబితాలో తెలంగాణకు 8వ ర్యాంకు
టాప్ 20లో….
రాష్ట్రం నుంచి ఒక్క సిటీ లేదు. ఏపీవి టాప్ టెన్లోనే 2 సిటీలు
టాప్ టెన్లో….
పది లక్షలకు పైబడిన జనాభా కేటగిరీ లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన రెండు సిటీలు టాప్ టెన్ లో చోటు దక్కించుకున్నాయి. విజయవాడ నాలుగో ర్యాంకు సాధిం చగా, విశాఖపట్నం తొమ్మిదో స్థానాన్ని సాధించింది. లక్షకు పైన జనాభాను లెక్కలోకి తీసుకుంటే టాప్ 25లో ఏపీవి మూడు సిటీలు ఉన్నాయి.
హైదరాబాద్ , వెలుగు: స్వచ్ఛ సర్వేక్షణ్ 2020లో ఈసారి కూడా మన సిటీలు వెనకబడ్డాయి. క్లీన్ సిటీల జాబితాలో ఒక్కటీ టాప్ 20లో చోటు దక్కించుకోలేకపోయాయి. హైదరాబాద్ 23వ స్థా నాన్ని సాధించింది. పోయినేడాది 35వ స్థానంలో ఉన్న హైదరాబాద్ .. ఈ ఏడాది 12 స్థానాలను మెరుగు పరుచుకుంది. అదే పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కు చెందిన రెండు సిటీలు టాప్ టెన్ లో చోటు దక్కించుకున్నాయి. పది లక్షల కన్నా ఎక్కువ జనాభా ఉన్న సిటీల జాబితాలో క్లీనెస్ట్ సిటీగా విజయవాడకు నాలుగో ర్యాంకు రాగా.. విశాఖపట్నం 9వ స్థానాన్ని సాధించింది. లక్ష కన్నా ఎక్కువ జనాభా ఉన్న సిటీలను లెక్కలోకి తీసుకుంటే టాప్ 25లో ఏపీవి మూడు సిటీలు చోటు దక్కించుకున్నా యి. ఈ జాబితాలో విజయవాడ ఆరో స్థానాన్ని సాధించగా, తిరుపతి 12, విశాఖపట్నం 17వ ర్యాం కును సాధించాయి. ‘స్వచ్ఛ మహోత్సవ్ ’ పేరిట గురువారం ఢిల్లీలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అవార్డులను వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ప్రకటించారు. వంద కన్నా తక్కువ మున్సి పాలిటీలున్న రాష్ట్రాల జాబితాలో స్వచ్ఛ రాష్ట్రం గా తెలంగాణ 8వ స్థానాన్ని దక్కించుకుంది. వంద కన్నా ఎక్కువ మున్సి పాలిటీలున్న రాష్ట్రాల విభాగంలో ఏపీ ఆరో ర్యాంకును సాధించింది. అయితే, సిటి జన్ ఫీడ్ బ్యాక్ విభాగంలో మాత్రం బెస్ట్ మెగాసిటీగా హైదరాబాద్ అవార్డును దక్కించుకుంది.
మిగతా సిటీల ర్యాంకులు ఇలా…
పది లక్షలలోపు జనాభా ఉన్న నగరాల్లో కరీంనగర్ కు 72, నిజామాబాద్ 133, వరంగల్ 144, మహబూబ్ నగర్ 20 0, రామగుండం 211, నల్గొండ 226, మిర్యాలగూడ 306, సూర్యాపేట 326, ఖమ్మం 329, ఆదిలాబాద్ 339వ ర్యాంకులో నిలిచాయి. 50 వేల నుంచి లక్ష వరకు జనాభా ఉన్న పట్టణాల జోనల్ ర్యాంకుల్లో సిరిసిల్ల 16, సిద్దిపేట 27, జహీరాబాద్ 31, గద్వాల్ 38, బోడుప్పల్ 42, వనపర్తి 51, వికారాబాద్ 67, కోరుట్ల 70, కాగజ్ నగర్ 74, సంగారెడ్డి 86, నిర్మల్ 95, జగిత్యాల 97, కొత్తగూడెం 102, పాల్వంచ 106, కోదాడ 109, మెట్ పల్లి 111, మందమర్రి 123, తాండూరు 138, బెల్లంపల్లి 138, భువనగిరి 139, హుజూరాబాద్ 141, జనగామ 143, జల్ పల్లి 148, బోధన్ 150, కామారెడ్డి 160, మంచిర్యాల 164వ ర్యాంకుల్లో నిలిచాయి.
మేడ్చల్ టాప్
25 వేల నుంచి 50 వేలలోపు జనాభా ఉన్న సౌత్ జోన్ పట్టణాల జాబితాలో మేడ్చల్ టౌన్ క్లీనెస్ట్ సిటీగా నిలిచింది. వేములవాడ నాలుగు, హుజూర్ నగర్ 9, షాద్ నగర్ 15, బాదేపల్లి 20, మెదక్ 24, కల్వకుర్తి 26వ ర్యాంకును సొంతం చేసుకున్నాయి. ఈ లిస్టులో మరో 23 పట్టణాలకు 300లోపు ర్యాంకులు దక్కాయి. 25 వేలలోపు జనాభా ఉన్న సౌత్ జోన్ పట్టణాల ర్యాంకుల్లో పరకాల 17, అచ్చంపేట 30వ స్థానంలో నిలిచాయి. ఈ కేటగిరీ లో మరో నాలుగు సిటీలకు 500లోపు ర్యాంకులు దక్కాయి. కంటోన్మెంట్ బోర్డుల్లో సికిం ద్రాబాద్ కంటోన్మెంట్ కు 31వ ర్యాంకు వచ్చింది.