- హైదరాబాద్ వృద్ధి అదుర్స్ నైట్‌ఫ్రాంక్ రిపోర్ట్వెల్లడి
హైదరాబాద్, వెలుగు: మనదేశంలో మొదటి ఆరు భారతీయ నగరాలలో విభిన్న వృద్ధి పారామితులలో (డైవర్స్ గ్రోత్ పారామీటర్స్) హైదరాబాద్ మొదటిస్థానంలో ఉంది. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా అవతరించింది. నైట్ ఫ్రాంక్ ఇండియా ఇండియా ప్రైమ్ సిటీ ఇండెక్స్ నివేదిక ప్రకారం..ఇండెక్స్ వృద్ధి పారామీటర్లలో సామాజిక ఆర్థిక పరిస్థితులు, రియల్ ఎస్టేట్, భౌతిక మౌలిక సదుపాయాలు, పాలన ఉన్నాయి.
బలమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి, పెరుగుతున్న రియల్ ఎస్టేట్ డిమాండ్, పెరుగుతున్న అల్ట్రా-హై నెట్ వర్త్ వ్యక్తులు, అధిక నికర విలువగల వ్యక్తుల జనాభా హైదరాబాద్ వృద్ధికి కారణాలు. అసాధారణమైన టాలెంట్ పూల్, డైనమిక్ బిజినెస్ ఎకోసిస్టమ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌కు అనువుగా ఉన్నందున బెంగళూరు రెండవ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా అవతరించింది. ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతం మూడోస్థానంలో ఉంది.