హైదరాబాద్, వెలుగు : లగ్జరీ ఇండ్ల అమ్మకాలు హైదరాబాద్లో వార్షికంగా 50 శాతానికి పైగా పెరిగాయని రియల్ఎస్టేట్కన్సల్టింగ్ సంస్థ సీబీఆర్ తెలిపింది. 2022 నుంచి మొత్తం ఇండ్ల (రూ.2 కోట్ల వరకు)అమ్మకాల్లో లగ్జరీ హౌసింగ్ ఇండ్ల వాటా 50 శాతం వరకు ఉంటోంది.
కొత్త ప్రాజెక్టుల్లో రూ. 45 లక్షల నుంచి కోటి వరకు ధర గల ఇండ్ల వాటా ఎక్కువ ఉంది. జూబ్లీహిల్స్ హైటెక్ సిటీ, కోకాపేట్ వంటి ప్రాంతాల్లో లగ్జరీ ఇండ్ల సేల్స్ పెరుగుతున్నాయి.