కంటి క్యాన్సర్ను గుర్తించేందుకు AI.. కనిపెట్టింది హైదరాబాద్ ఎల్వీ ప్రసాద్ ఐ ఆస్పత్రి పరిశోధకులే

కంటి క్యాన్సర్ను గుర్తించేందుకు AI.. కనిపెట్టింది హైదరాబాద్ ఎల్వీ ప్రసాద్ ఐ ఆస్పత్రి పరిశోధకులే

దేశంలోనే మొట్టమొదటిసారిగా హైదరాబాద్‌కు చెందిన పరిశోధకులు కంటి క్యాన్సర్లను గుర్తించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత మోడల్ ను డెవలప్  చేశారు. దీనిని రెటినోబ్లాస్టోమా (RB) అని కూడా పిలుస్తారు.

హైదరాబాద్‌కు చెందిన ఎల్‌వి ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్ (LVPEI) డాక్టర్ విజిత ఎస్. వెంపులూరు, యుఎస్‌కు చెందిన విల్స్ ఐ హాస్పిటల్ కు చెందిన కంటి నిపుణురాలు డాక్టర్ స్వాతి కలికి,  IIIT -హైదరాబాద్‌లోని డాక్టర్ కరోల్ ఎల్. షీల్డ్స్ , టెక్‌సోఫీ ఇంక్ నుంచి కంటి పరిశోధనలు చేస్తున్న వీరంతా ఓక్యులర్ ఆంకాలజీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ అని పిలువబడే మొదటి AI మోడల్‌ను అభివృద్ధి చేశారు. రెటినోబ్లాస్టోమా (ArMOR) అని పిలువబడే ఈ AI మోడల్ కంటి క్యాన్సర్లను ఖచ్చితత్వంతో నిర్ధారిస్తుంది. 

ALSO READ : మీకు తెలుసా: ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్నారు కదా.. వీటిని తీసుకొచ్చింది ఈ మన్మోహన్ సింగ్నే..

ArMOR అభివృద్ది, రెటినోబ్లాస్టోమాను గుర్తించి సామర్థ్యాన్ని పరీక్షించామని క్యాన్సర్లు (అక్టోబర్, 2024) జర్నల్‌లో కొత్త అధ్యయనంలో ప్రచురించబడిన పరిశోధకులు చెప్పారు. రెటినోబ్లాస్టోమా (ArMOR) AI మోడల్ ద్వారా రకరకాల రోగుల్లో రెటినోబ్లాస్టోమాను గుర్తించే సామర్థ్యాన్ని పరీక్షించారు. ఈ AI మోడల్ రెటినోబ్లాస్టోమాను 97 శాతం ఖచ్చితంగా గుర్తించిందని క్యాన్సర్లలో ప్రచురించబడిన అధ్యయనంలో పేర్కొంది.