అస్సలు వదలొద్దు : పిస్తా హౌస్, బర్గర్ కింగ్ లో ఫుడ్ సేప్టీ తనిఖీలు

అస్సలు వదలొద్దు : పిస్తా హౌస్, బర్గర్ కింగ్ లో ఫుడ్ సేప్టీ తనిఖీలు

గ్రేటర్ హైదరాబాద్ లోని పలు హోటళ్లు, రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు మంగళవారం రైడ్స్ చేశారు. రైడ్స్ చేసిన ప్రతి చోట ఏదో ఓ తప్పులు బయటపడుతున్నాయి.  తాజాగా మలక్‌పేటలోని పిస్తా హౌస్‌, బర్గర్‌ కింగ్‌, అజీబోలో మంగళవారం జరిపిన దాడుల్లో ఫుడ్‌ సేఫ్టీ టీమ్‌ రూల్స్ కు విరుద్ధంగా పలు ఉల్లంఘనలను గుర్తించింది. పిస్తా హౌస్‌లో స్టోర్‌రూమ్‌లో మురుగు నీటి నిల్వ, మరియు సాలెపురుగులు ఉన్నాయి. పచ్చి ఉల్లిపాయలను నేరుగా నేలపైనే నిల్వ ఉంచారని, కొన్నింటిని పరుగులు పట్టి అద్వానంగా ఉన్నాయని ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు. 

ALSO READ | నిథిమ్ కాలేజీలో అక్రమ కట్టడాల కూల్చివేత.. ఈసారి హైడ్రా కాదు

 అజీబో ది రాయల్ అరేబియన్ రెస్టారెంట్ లో కూడా సోదాలు నిర్వహించారు. వంటగది లోపల కాలువలలో నీరు నిలిచిపోవడాన్ని గమనించింది. అంతేకాకుండా, డస్ట్‌బిన్‌లు సరైన మూతలు లేకుండా తెరిచి ఉన్నాయి, రిఫ్రిజిరేటర్ లోపల నిల్వ చేసిన ఆహార పదార్థాలు కవర్ చేయలేదు. బర్గర్ కింగ్‌ సోదాల్లో భాగంగా మాంసాహార పదార్థాలను వేయించడానికి ఉపయోగించే పామాయిల్ తనిఖీ సమయంలో టోటల్ పోలార్ కాంపౌండ్ (TPC) విలువ 27.0ని కలిగి ఉందని, ఇది గరిష్టంగా అనుమతించదగిన 25.0 విలువను మించిందని అధికారులు గుర్తించారు. దీంతో 15 లీటర్ల వంటనూనెను స్వాధీనం చేసుకున్నారు. ఆహారపదార్ధాలు కల్తీ, తయారీలో నిర్లక్ష్యం వహించినందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు.