కూకట్పల్లి, వెలుగు: సిటీలో ఆదివారం జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు.కూకట్‌పల్లిలో కన్స్ట్రక్షన్ సైట్లో ప్రమాదవశాత్తు రాళ్లు, మట్టి పెళ్లలు పడి ఓ యువకుడు చనిపోయాడు. బీహార్‌కు చెందిన రవికుమార్(21) తోటి కార్మికులతో కలిసి అండర్‌గ్రౌండ్ పవర్ కేబుల్ లైన్ కోసం సైట్లో తవ్వకాలు చేస్తున్నాడు. ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట సమయలో రవికుమార్ పవర్ లైన్‌కోసం తవ్విన గుంతలో దిగి పని చేస్తుండగా, పైనుంచి రాళ్లు, మట్టి పెళ్లలు తలపై పడి స్పాట్లోనే చనిపోయాడు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి
గండిపేట్: గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో వ్యక్తి మృతి చెందిన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. కర్మన్‌ఘాట్‌కు చెందిన మధుసూదన్ రెడ్డి రాజేంద్రనగర్ ప్రాంతం నుంచి వెళుతుండగా గుర్తు తెలియని వాహనం బలంగా ఢీకొట్టడంతో స్పాట్లోనే చనిపోయాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.