హైదరాబాద్ లో మంచు విపరీతంగా పడుతుండటం వల్ల రోడ్లు స్పష్టంగా కనిపించడం లేదు. దీనితో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ రోజు (జనవరి 24) తెల్లవారు జామున రంగారెడ్డి జిల్లా కిస్మత్ పురాలో భారీ ప్రమాదం తప్పింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే...
రంగారెడ్డి జిల్లాలో భారీ ప్రమాదం తప్పింది. హైదరాబాద్ లో భారీగా పొగమంచు పడింది. బండ్లగూడ జాగిర్ కార్పొరేషన్ పరిధిలో రహదారులను పొగమంచు కప్పేసింది. వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కిస్మత్ పూర్ SBI బ్యాంకు వద్ద ఈ రోజు ( జనవరి 24) తెల్లవారుజామున పొగ మంచు కారణంగా రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ను కారు ఢీకొట్టింది. అయితే కారు ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో పెను ప్రమాదం తప్పింది.సమాచారం అందుకున్న విద్యుత్ అధికారులు కిస్మత్ పురాలో విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు.
ఈ ఘటనలో కారు పూర్తిగా డ్యామేజ్ అయింది. రోడ్డు పక్కన ఉన్న ఎలక్ట్రికల్ స్తంభాలను .. ట్రాన్స్ ఫారమ్ ను తొలగించాలని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని స్థానికులు వాపోతున్నారు.