సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లారు హైదరాబాద్ లోని జనం. దాదాపు 80 శాతం సిటీ ఖాళీ అయింది. దీంతో ప్రధాన కూడళ్లలో రద్దీ తగ్గింది. రోడ్లు బోసి పోయి కనిపిస్తున్నాయి. జనవరి 11 రాత్రి నుంచే దాదాపుగా సొంతూళ్లకు ప్రయాణమయ్యారు.
సంక్రాంతి సందర్భంగా సిటీలోని ప్రైవేట్ హాస్టళ్లు సైతం బంద్ ప్రకటించాయి. బేగంపేట,అమీర్ పేట, మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కొండాపూర్, కూకట్ పల్లితో వైపు రోడ్స్ పై వాహనాలు తగ్గాయి. ట్రాఫిక్ జాంలతో గంటల తరబడి రోడ్ల పైనే వేచి ఉండే వాహనదారులు ఇప్పుడు 10 -15 నిమిషాల్లో తమ గమ్యస్థానాలకు చేరుతున్నారు
ALSO READ | వందే భారత్ రైలు బోగీలు డబుల్
మరో వైపు సంక్రాంతికి హైదరాబాద్ నుంచి జనం సొంతూళ్ళకు వెళుతుండటంతో ఎక్కడ ట్రాఫిక్ జాం కాకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు ఐజీ సత్యనారాయణ. నల్లగొండ జిల్లా చిట్యాలలో నేషనల్ హైవేపై ట్రాఫిక్ ని పర్యవేక్షించారు.హైదరాబాద్ నుంచి ఆంధ్రవైపు సాధారణ సమయంలో 10వేల వాహనాలు వెళ్లే..నిన్న మొన్న కలిపి లక్షకు పైగా వాహనాలు వెళ్లాయని తెలిపారు. పండగ తర్వాత ఏపీ నుంచి హైదరాబాద్ కు వచ్చే వాహనాలతో ఇదే విధంగా ట్రాఫిక్ రద్దీ ఉంటుందన్నారు. అప్పటివరకు పోలీసుల బందోబస్తు ఉంటుందన్నారు తెలిపారు .