హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని కేపీహెచ్బీలో ఇద్దరు వాహనదారులను లక్ష్యంగా చేసుకున్న దొంగలు వారి వద్ద ఉన్న బంగారు ఆభరణాలు, నగదు, మొబైల్ ఫోన్లను దోచుకెళ్లిన కేసును పోలీసులు ఛేదించారు. కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో గురువారం, నవంబర్ 13న రెండు వేర్వేరు కేసుల్లో ఇద్దరు వ్యక్తుల మొబైల్ ఫోన్లు, బంగారు గొలుసులు దోచుకెళ్లారు.
ALSO READ | పాపం.. ఇద్దరూ 30 ఏళ్ల లోపు కుర్రాళ్లు.. గచ్చిబౌలి విప్రో సర్కిల్ దగ్గర విషాద ఘటన
మొదటి కేసులో కేపీహెచ్‌బీ కాలనీ బ్రాండ్ ఫ్యాక్టరీ రోడ్డు వద్ద ఓ వ్యక్తి వద్దకు రెండు బైక్‌లపై నలుగురు దొంగలు వచ్చారు. బాధితుడిని కత్తితో బెదిరించి మొబైల్ ఫోన్, 1.5 తులాల బంగారు గొలుసు అపహరించారు. జగద్గిరిగుట్టకు చెందిన బాధితుడు అరుణరావు మోటార్ సైకిల్‌పై వెళుతుండగా దుండగులు అతని వద్దకు వచ్చి ఈ దారుణానికి పాల్పడ్డారు. మరో బాధితుడు నరేష్‌ను బెదిరించి సెల్ ఫోన్స్ లాక్కెళ్లారు. పోలీసుల దర్యాప్తులో ఇద్దరు దొంగలు దొరికారు.