
సికింద్రాబాద్: సికింద్రాబాద్ రైల్వే పోలీసులు మానవత్వం చాటుకున్నారు. ఓ నిండు గర్భిణి అయిన ప్రయాణికులరాలు సుఖ ప్రసవం అయ్యేలా సాయం చేశారు. ఒడిశాకు చెందిన మహోజీ అనే మహిళ తన భర్తతో కలిసి దుండిగల్ లో ఉంటోంది. వైజాగ్ వెళ్లేందుకు దంపతులిద్దరూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వచ్చారు.
గర్భిణీ అయిన మహోజీకి పురిటి నొప్పుడు ఎక్కువ కావడంతో అక్కడే ఉన్న ఆర్పీఎఫ్ పోలీసులు... ఎమర్జెన్సీ యూనిట్ కు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడకు చేరుకున్న 108 సిబ్బంది ఆమెకు అక్కడే ప్రసవం చేశారు. ఆర్పీఎఫ్ మహిళా కానిస్టేబుళ్లు ఒక బెడ్ షీట్ తో గర్భిణీకి రక్షణగా నిలిచారు. మహోజీ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డలిద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్లు సిబ్బంది తెలిపారు.