హైదరాబాద్ నుంచి రోజుకు 3 వేల పాస్ పోర్టులు జారీ చేస్తుంది. ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం ప్రతిరోజూ స్పీడ్ పోస్ట్‌ని ఉపయోగించి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టుంది. దరఖాస్తుదారులకు పోస్ట్‌ల శాఖ ద్వారా 24 గంటల్లో వీటిని అందజేస్తారు.
ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి దాసరి బాలయ్య, తెలంగాణ సర్కిల్ చీఫ్ పాస్‌పోర్ట్ మాస్టర్ జనరల్ డాక్టర్ పీవీఎస్ రెడ్డితో సమావేశమయ్యారు. పోస్టాఫీసు పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల (PoPSK) నిర్వహణకు సంబంధించిన వివిధ విషయాలను పరిష్కరించాలని చర్చలు జరిపారు.
ఈ సమావేశంలో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. ఇందులో భాగంగా మేడ్చల్‌లోని పీఓఎస్‌పీకేలో కమ్యూనికేషన్ టవర్ నిర్మాణం చేపట్టాలని సూచించారు. ఈ క్రమంలో అదనపు సిబ్బందిని నియమించే అంశాలపై కూడా చర్చించారు.
తెలంగాణ రాష్ట్ర నివాసితులకు పాస్‌పోర్ట్ సేవలను మెరుగుపరచడంలో సహకరించాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. పాస్‌పోర్ట్ కు సంబంధిత సేవలను మెరుగుపరచడానికి, విస్తరించడానికి కలిసి పనిచేయాలని అంగీకారం కుదుర్చుకున్నారు.
ALSO READ :- తెలంగాణలో కాంగ్రెస్ కు అనుకూల పవనాలు వీస్తున్నాయి.. కల్వకుంట్ల కుటుంబానికి అహం పెరిగింది