రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో హైదరాబాద్ లో భారీగా నగదు పట్టుబడుతుంది. పోలీసులు చెక్ పోస్టులు పెట్టి.. తనిఖీలు నిర్వహించిన ఎక్కడికి వెళ్లాల్సిన డబ్బు అక్కడికి చేరుకుంటుంది. తాజాగా ఓ ఇన్నోవా కారులో తరలిస్తున్న రూ. 97 లక్షల 30వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్ లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో ఈ నగదు పట్టుబడిందని అధికారులు తెలిపారు. సీజ్ చేసిన డబ్బులు వరంగల్ జిల్లాకు చెందిన ఓ కాంట్రాక్టర్ కు చెందినవిగా పోలీసులు అనుమానిస్తున్నారు. పట్టుబడిన నగదును సీజ్ చేసి.. ఐటీ అధికారులకు అప్పగించామని పోలీసులు చెప్పారు.