ఆరెంజ్.. ఓ రేంజ్‌‌‌‌‌‌‌‌లో.. 266/7 స్కోర్​తో మళ్లీ దంచికొట్టిన సన్ రైజర్స్‌‌‌‌‌‌‌‌

ఆరెంజ్.. ఓ రేంజ్‌‌‌‌‌‌‌‌లో.. 266/7 స్కోర్​తో మళ్లీ దంచికొట్టిన సన్ రైజర్స్‌‌‌‌‌‌‌‌
  •     చెలరేగిన హెడ్, షాబాజ్‌‌‌‌‌‌‌‌, అభిషేక్ 
  •     రాణించిన నటరాజన్​, నితీశ్​​

ఆరెంజ్ ఆర్మీగా పాపులర్ అయిన సన్‌‌‌‌‌‌‌‌ రైజర్స్‌‌‌‌‌‌‌‌ హైదరాబాద్ ఈ ఐపీఎల్‌‌‌‌‌‌‌‌లో ఓ రేంజ్‌‌‌‌‌‌‌‌లో  ఆడుతోంది. వీర బాదుడు బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌తో ప్రత్యర్థి జట్లకు, బౌలర్లకు చెమటలు పట్టిస్తూ.. ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌కు మస్తు కిక్కిస్తోంది. గత పోరులో ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీబీకి చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ఈసారి ఢిల్లీ గడ్డపై గర్జించింది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌తో విజృంభించిన వేళ  ఈ ఫార్మాట్‌‌‌‌‌‌‌‌లో వేగంగా 100, 150 రన్స్‌‌‌‌‌‌‌‌తో పాటు పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్లేలో అత్యధిక రన్స్ రాబట్టిన జట్టుగా రికార్డులు బద్దలుకొట్టింది. ఈ సీజన్‌‌‌‌‌‌‌‌లో ముచ్చటగా మూడోసారి 260 రన్స్‌‌‌‌‌‌‌‌ స్కోరు చేసిన రైజర్స్‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌‌‌‌‌లోనూ మెప్పించి ఢిల్లీ క్యాపిటల్స్‌‌‌‌‌‌‌‌ను పడగొట్టి రెండో ప్లేస్‌‌‌‌‌‌‌‌కు దూసుకొచ్చింది. 

న్యూఢిల్లీ: మరోసారి పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫుల్ బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌తో రెచ్చిపోయిన సన్‌‌‌‌‌‌‌‌ రైజర్స్ వరుసగా నాలుగో విజయంతో అదరగొట్టింది. ట్రావిస్ హెడ్ (32 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 11 ఫోర్లు, 6 సిక్సర్లతో 89), షాబాజ్ అహ్మద్ (29 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 59 నాటౌట్‌‌‌‌‌‌‌‌), అభిషేక్ శర్మ (12 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 2 ఫోర్లు, 6 సిక్సర్లతో 46)  దంచికొట్టడంతో శనివారం జరిగిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో రైజర్స్‌‌‌‌‌‌‌‌   67 రన్స్ తేడాతో ఢిల్లీని చిత్తు చేసింది. తొలుత హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ 20 ఓవర్లలో 266/7 స్కోరు చేసింది. వైజాగ్ కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి (27 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 37) కూడా రాణించాడు. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్‌‌‌‌‌‌‌‌ నాలుగు వికెట్లతో ఆకట్టుకోగా.. అక్షర్ పటేల్ (1/29) పొదుపుగా బౌలింగ్‌‌‌‌‌‌‌‌ చేశాడు.

ఢిల్లీ బౌలర్లలో ముగ్గురు ఫిఫ్టీ రన్స్‌‌‌‌‌‌‌‌ ఇచ్చుకున్నారు. ఛేజింగ్‌‌‌‌‌‌‌‌లో  డీసీ  19.1 ఓవర్లలో 199 రన్స్‌‌‌‌‌‌‌‌కు ఆలౌటై ఓడింది. జేక్ ఫ్రేజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెక్‌‌‌‌‌‌‌‌గర్క్ (18 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 5 ఫోర్లు, 7 సిక్సర్లతో 65), అభిషేక్ పోరెల్ (22 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 7 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌‌‌‌‌తో 42), రిషబ్ పంత్ (34 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 5 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌‌‌‌‌తో 44) పోరాడినా ఫలితం లేకపోయింది. నటరాజన్ నాలుగు, మయాంక్ మార్కండే, నితీశ్ రెడ్డి  రెండేసి వికెట్లు తీశాడు. హెడ్‌‌‌‌‌‌‌‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

బౌండరీల మోత

2.4 ఓవర్లలో 50..  5  ఓవర్లలో 100..  8.4 ఓవర్లలో 150 రన్స్‌‌‌‌‌‌‌‌. సన్‌‌‌‌‌‌‌‌రైజర్స్‌‌‌‌‌‌‌‌ ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్  బ్యాటింగ్ విధ్వంసం సాగిన తీరిది. బెంగళూరులో గత మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో తమ పేరిటే ఉన్న టాప్ స్కోరు రికార్డును బ్రేక్‌‌‌‌‌‌‌‌ చేసిన హైదరాబాద్ అదే జోరును ఢిల్లీలోనూ కొనసాగించింది. తమ తర్వాతి టార్గెట్‌‌‌‌‌‌‌‌ 300 రన్స్‌‌‌‌‌‌‌‌ అని చెప్పిన హెడ్ అన్నంత పని చేసేలా కనిపించాడు. అతనికి తోడు అభిషేక్ కూడా దంచికొట్టాడు. గ్రౌండ్ షాట్ ఆడితే ఫోర్, గాల్లోకి లేపితే సిక్స్‌‌‌‌‌‌‌‌ అన్నట్టు సాగిన ఈ ఇద్దరి ఆట చూసి ఢిల్లీ ప్లేయర్ల మైండ్ బ్లాంక్ అయింది.

ఖలీల్‌‌‌‌‌‌‌‌ వేసిన తొలి ఓవర్లో 6, 4, 4తో  తన విధ్వంసాన్ని షురూ చేసిన హెడ్.. లలిత్ బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో 6,6,4.. నార్జ్ వేసిన మూడో ఓవర్లో నాలుగు ఫోర్లు, సిక్స్‌‌‌‌‌‌‌‌తో టాప్ గేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి వెళ్లిపోయాడు. మూడు ఓవర్లకే స్కోరు 60 దాటగా.. హెడ్ 16 బాల్స్‌‌‌‌‌‌‌‌లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. తొలి మూడు ఓవర్లలో ఎదుర్కొన్న రెండు బాల్స్‌‌‌‌‌‌‌‌ను ఫోర్లుగా మలచిన అభిషేక్‌‌‌‌‌‌‌‌.. లలిత్ ఓవర్లో రెండు, మరో స్పిన్నర్ కుల్దీప్‌‌‌‌‌‌‌‌ ఓవర్లో మూడు సిక్సర్లతో విజృంభించాడు. దాంతో ఐదు ఓవర్లకే స్కోరు వంద దాటింది. ఆరో ఓవర్లో బౌలింగ్‌‌‌‌‌‌‌‌కు వచ్చిన ముకేశ్‌‌‌‌‌‌‌‌కు హెడ్ వరుసగా నాలుగు ఫోర్లు, ఓ సిక్స్‌‌‌‌‌‌‌‌తో స్వాగతం పలికాడు.

దాంతో పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేలో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ రికార్డు స్థాయిలో 125 రన్స్‌‌‌‌‌‌‌‌ చేసింది. తొలి ఆరు ఓవర్లలోనే పంత్ ఐదుగురు బౌలర్లను మార్చాడు. పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లే ముగిసిన వెంటనే టైమ్ ఔట్ తీసుకొని రైజర్స్ జోరును అడ్డుకునేందుకు ప్లాన్‌‌‌‌‌‌‌‌ వేశాడు. ఇది వర్కౌట్‌‌‌‌‌‌‌‌ అయింది. ఏడో ఓవర్లో అభిషేక్‌‌‌‌‌‌‌‌తో పాటు మార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్రమ్ (1)ను ఔట్‌‌‌‌‌‌‌‌ చేసిన కుల్దీప్‌‌‌‌‌‌‌‌  ఢిల్లీకి డబుల్ బ్రేక్ ఇచ్చాడు.  మరోవైపు పొదుపుగా బౌలింగ్‌‌‌‌‌‌‌‌ చేసిన అక్షర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎనిమిదో ఓవర్లో ఐదే రన్స్‌‌‌‌‌‌‌‌ ఇచ్చాడు. కుల్దీప్ వేసిన తొమ్మిదో ఓవర్లో  రెండు సిక్సర్లు కొట్టిన క్లాసెన్ (15) స్కోరు 150 దాటించాడు. అదే ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  ఆఖరి బాల్‌‌‌‌‌‌‌‌కు స్టబ్స్‌‌‌‌‌‌‌‌ పట్టిన చురుకైన క్యాచ్‌‌‌‌‌‌‌‌కు హెడ్ ఔటవగా.. తర్వాతి ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తొలి బాల్‌‌‌‌‌‌‌‌కే అద్భుతమైన డెలివరీతో క్లాసెన్‌‌‌‌‌‌‌‌ను అక్షర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్లీన్‌‌‌‌‌‌‌‌బౌల్డ్‌‌‌‌‌‌‌‌ చేశాడు.

హిట్టర్లంతా పెవిలియన్ చేరి సన్‌‌‌‌‌‌‌‌ రైజర్స్ 154/4తో నిలవడంతో ఢిల్లీ కాస్త ఊపిరి పీల్చుకుంది.  ఈ దశలో క్రీజులో కుదురుకున్న నితీశ్‌‌‌‌‌‌‌‌, షాబాజ్‌‌‌‌‌‌‌‌  వీలుచిక్కినప్పుడల్లా బౌండ్రీలు కొడుతూ 16 ఓవర్లకు స్కోరు 200 దాటించారు.  కుల్దీప్‌‌‌‌‌‌‌‌ వేసిన 17 ఓవర్లో రివర్స్‌‌‌‌‌‌‌‌ స్కూప్‌‌‌‌‌‌‌‌ షాట్‌‌‌‌‌‌‌‌తో సిక్స్‌‌‌‌‌‌‌‌తో అలరించిన నితీశ్‌‌‌‌‌‌‌‌ తర్వాతి బాల్‌‌‌‌‌‌‌‌కే వార్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు క్యాచ్‌‌‌‌‌‌‌‌ ఇవ్వడంతో  ఐదో  వికెట్‌‌‌‌‌‌‌‌కు 67 రన్స్‌‌‌‌‌‌‌‌  పార్ట్‌‌‌‌‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్ ముగిసింది. చివర్లో సమద్‌‌‌‌‌‌‌‌ (13)తో కలిసి షాబాజ్‌‌‌‌‌‌‌‌ ధాటిగా ఆడాడు. ఖలీల్‌‌‌‌‌‌‌‌ వేసిన 19వ ఓవర్లో సమద్ సిక్స్‌‌‌‌‌‌‌‌ కొట్టగా.. ఖలీల్ వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. ముకేశ్ వేసిన ఆఖరి ఓవర్లో సమద్ ఔటైనా.. షాబాజ్‌‌‌‌‌‌‌‌ రెండు ఫోర్లు, సిక్స్‌‌‌‌‌‌‌‌తో స్కోరు 260 దాటించి ఫినిషింగ్ టచ్‌‌‌‌‌‌‌‌ ఇచ్చాడు. 

ఫ్రేజర్ పోరాడినా

భారీ టార్గెట్‌‌‌‌‌‌‌‌ ఛేజింగ్‌‌‌‌‌‌‌‌లో ఢిల్లీ కూడా విజృంభించింది. 6.4 ఓవర్లలోనే వంద రన్స్‌‌‌‌‌‌‌‌ చేసింది. కానీ, క్రమం తప్పకుండా వికెట్లు తీసిన సన్‌‌‌‌‌‌‌‌రైజర్స్‌‌‌‌‌‌‌‌ బౌలర్లు ఆ టీమ్‌‌‌‌‌‌‌‌ను అడ్డుకున్నారు. వాషింగ్టన్ సుందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేసిన తొలి ఓవర్లో వరుసగా నాలుగు ఫోర్లు కొట్టిన ఓపెనర్ పృథ్వీ షా (16) ఐదో బాల్‌‌‌‌‌‌‌‌కు సమద్‌‌‌‌‌‌‌‌కు క్యాచ్‌‌‌‌‌‌‌‌ ఇచ్చాడు. క్రాస్ సీమ్ డెలివరీతో డేవిడ్ వార్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (1)ను భువనేశ్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఔట్‌‌‌‌‌‌‌‌ చేశాడు. కానీ.. వన్‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌ బ్యాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జేక్ ఫ్రేజర్ మెక్‌‌‌‌‌‌‌‌గర్క్‌‌‌‌‌‌‌‌ ఉన్నంతసేపు భారీ షాట్లతో హడలెత్తించాడు.  సుందర్ వేసిన మూడో ఓవర్లో 4,4, 6, 4, 6, 6తో 30 రన్స్‌‌‌‌‌‌‌‌ రాబట్టాడు.

కమిన్స్‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో అభిషేక్ పోరెల్ రెండు ఫోర్లు.. ఫ్రేజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 4, 6 కొట్టగా పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేలో డీసీ 88/2 స్కోరు చేసింది. ఆపై స్పిన్నర్ మార్కండే బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో వరుసగా మూడు సిక్సర్లతో ఫ్రేజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టేడియాన్ని హోరెత్తించాడు. 15 బాల్స్‌‌‌‌‌‌‌‌లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్న అతను మరో  షాట్‌‌‌‌‌‌‌‌కు ట్రై చేసి కీపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్లాసెన్‌‌‌‌‌‌‌‌కు క్యాచ్‌‌‌‌‌‌‌‌ ఇచ్చాడు. షాబాజ్ వేసిన తర్వాతి ఓవర్లో మూడు ఫోర్లు, సిక్స్‌‌‌‌‌‌‌‌తో  స్పీడు పెంచిన పోరెల్‌‌‌‌‌‌‌‌.. మార్కండే బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో స్టంపౌట్‌‌‌‌‌‌‌‌ కావడంతో డీసీ 135/4తో డీలా పడింది.

రైజర్స్ బౌలర్లు పుంజుకోవడంతో  కెప్టెన్ రిషబ్ పంత్, ట్రిస్టాన్ స్టబ్స్ (10) వేగంగా ఆడలేకపోయారు.  దాంతో రన్ రేట్‌‌‌‌‌‌‌‌ పడిపోయింది. స్కోరు 150 దాటిన తర్వాత ఓ షార్ట్‌‌‌‌‌‌‌‌బాల్‌‌‌‌‌‌‌‌తో స్టబ్స్‌‌‌‌‌‌‌‌ను ఐదో వికెట్‌‌‌‌‌‌‌‌గా నితీశ్ పెవిలియన్‌‌‌‌‌‌‌‌ చేర్చాడు. కాసేపటికే లలిత్‌‌‌‌‌‌‌‌ యాదవ్‌‌‌‌‌‌‌‌ (7)ను నటరాజన్‌‌‌‌‌‌‌‌ క్లీన్‌‌‌‌‌‌‌‌బౌల్డ్‌‌‌‌‌‌‌‌ చేయడంతో  సన్ రైజర్స్‌‌‌‌‌‌‌‌ విజయం ఖాయమైంది. పంత్ ప్రతిఘటించినా 19వ ఓవర్లో అక్షర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పటేల్ (6), అన్రిచ్ (0), కుల్దీప్‌‌‌‌‌‌‌‌ (0)ను నటరాజన్‌‌‌‌‌‌‌‌ ఔట్‌‌‌‌‌‌‌‌ చేశాడు. నితీశ్ వేసిన చివరి ఓవర్లో పంత్ ఆఖరి వికెట్‌‌‌‌‌‌‌‌గా ఔటవడంతో ఢిల్లీకి  భారీ ఓటమి తప్పలేదు. 

సంక్షిప్త స్కోర్లు


సన్‌‌‌‌‌‌‌‌రైజర్స్‌‌‌‌‌‌‌‌: 20 ఓవర్లలో 266/7 (హెడ్ 89, షాబాజ్‌‌‌‌‌‌‌‌ 59*, అభిషేక్ 46, కుల్దీప్ 4/55).
ఢిల్లీ:    19.1 ఓవర్లలో 199 ఆలౌట్ (మెక్‌‌‌‌‌‌‌‌గర్క్ 65, పంత్ 44, పోరెల్ 42, నటరాజన్ 4/19)

125/0  
పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేలో సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రైజర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసిన స్కోరు. టీ20 ఫార్మాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అత్యధికం. 2017లో డర్హమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై నాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 106/0, అదే ఏడాది ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీబీపై కేకేఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 105/0 స్కోర్ల  రికార్డును బ్రేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసింది.

5
సన్ రైజర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వంద రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసేందుకు అవసరమైన ఓవర్లు. గతేడాది సెంచూరియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వెస్టిండీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై సౌతాఫ్రికా 5.3 ఓవర్లలో వేగంగా వంద రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసిన రికార్డు బ్రేక్ అయింది. ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీబీపై 2017లో కేకేఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 6 ఓవర్లలో వంద రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసిన రికార్డు  కూడా బద్దలైంది.

ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మూడుసార్లు 250 స్కోర్లు చేసిన తొలి టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రైజర్స్. ఫ్రాంచైజీ క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సర్రే తర్వాత ఈ ఘనత సాధించిన రెండో టీమ్.

24 
పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేలో సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రైజర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాబట్టిన బౌండరీలు. టీ20ల్లో అత్యధికం. 2014లో ససెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై శ్రీలంక 20 బౌండరీల రికార్డు కనుమరు గైంది. తొలి ఆరు ఓవర్లలో  రైజర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 11 సిక్సర్లు  రాబట్టడం కూడా ఓ రికార్డే. 

8.4 
  సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రైజర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 150 మార్కు దాటేందుకు ఆడిన ఓవర్లు. 2019లో నార్తాంప్టన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై వోర్సెస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షైర్ 9.2 ఓవర్లలో 150 రన్స్ రికార్డును అధిగమించింది.