హిమాచల్‌‌‌‌ ప్రదేశ్‌‌‌‌తో రంజీ ట్రోఫీ మ్యాచ్‌‌‌‌లో హైదరాబాద్‌‌‌‌ భారీ స్కోరు

హిమాచల్‌‌‌‌ ప్రదేశ్‌‌‌‌తో రంజీ  ట్రోఫీ మ్యాచ్‌‌‌‌లో హైదరాబాద్‌‌‌‌ భారీ స్కోరు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు : హిమాచల్‌‌‌‌ ప్రదేశ్‌‌‌‌తో రంజీ  ట్రోఫీ మ్యాచ్‌‌‌‌లో హైదరాబాద్‌‌‌‌ భారీ స్కోరు చేసింది. ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న గ్రూప్–బి మ్యాచ్‌‌‌‌లో ఓవర్‌‌‌‌‌‌‌‌నైట్ స్కోరు 291/2తో రెండో రోజు, శుక్రవారం ఆట కొనసాగించిన ఆతిథ్య హైదరాబాద్​ 565 రన్స్ వద్ద ఆలౌటైంది. ఓపెనర్‌‌‌‌ తన్మయ్‌‌‌‌ అగర్వాల్‌‌‌‌ (177)  భారీ సెంచరీ కొట్టగా.. కొడిమెల హిమతేజ (76), శరణు నిశాంత్ (71), రక్షణ్ రెడ్డి (42) రాణించారు. 

హిమాచల్ బౌలర్లలో ఆకాశ్ వశిష్ట్‌‌‌‌ 4, ముకుల్ నేగి మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్‌‌‌‌కు వచ్చిన హిమాచల్ జట్టు తొలి ఇన్నింగ్స్‌‌‌‌లో రెండో రోజు చివరకు 9 ఓవర్లలో 33/1 స్కోరుతో నిలిచింది. ఓపెనర్ ప్రశాంత్ చోప్రా (1)ను నిశాంత్ ఔట్ చేయగా.. శుభం అరోరా (21 బ్యాటింగ్‌‌‌‌), అంకిత్ కాల్సి (5 బ్యాటింగ్‌‌‌‌) క్రీజులో ఉన్నారు. హైదరాబాద్ స్కోరుకు హిమాచల్ ఇంకా 532 రన్స్ దూరంలో ఉంది.