హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కొత్త ఓటర్లు నమోదు కార్యక్రమం నిన్నటితో ( అక్టోబర్31) ముగిసిన సందర్బంగా హైదరాబాద్ నగరంలో కొత్తగా నమోదైన ఓటర్ల వివరాలను వెల్లడించారు హైదరాబాద్ ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్. శనివారం ఒక్క రోజే (అక్టోబర్ 28న) హైదరాబాద్ నగరంలో 15 వేల కొత్త ఓటర్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
ఫారం 6 మొత్తం దరఖాస్తుల సంఖ్య 1.35 లక్షలకు చేరుకుందని వీటిలో 83 వేల దరఖాస్తులు వెరిఫికేషన్ అయిపోయిందని హైదరాబాద్ ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ వెల్లడించారు. దీంతో నగరంలో మొత్తం ఓటర్ల సంఖ్య 45 లక్షలకు చేరుకుంటుందని అంచనా వేశారు.
హైదరాబాద్ నగరంలో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు బూత్ లెవల్ ఆఫీసర్( బీఎల్ ఓ)ల ద్వారా ఇంటింటికి స్టిక్కర్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. తుది జాబితా ప్రచురించిన తర్వాత ఓటరు సమాచారంతో కూడిన కరపత్రాన్ని కూడా ఓటర్లకు అందజేస్తారు అని రోనాల్స్ రాస్ తెలిపారు.