
- గత ఏడాది 35 లక్షల
- చదరపు అడుగుల జాగా అమ్మకం
హైదరాబాద్, వెలుగు: గిడ్డంగులకు డిమాండ్ ఏటా పెరుగుతూనే ఉంది. హైదరాబాద్‌లో గత ఏడాది 35 లక్షల చదరపు అడుగుల కోసం లావాదేవీలు జరిగాయి. 34 శాతం జాగాను మానుఫ్యాక్చరింగ్ సెక్టారే కొనుగోలు చేసిందని రియల్ఎస్టేట్ కన్సల్టెన్సీ నైట్‌ఫ్రాంక్ తెలిపింది. దీని రిపోర్ట్ ప్రకారం.. అదనపు డిమాండ్‌ను తీర్చడానికి హైదరాబాద్ నగరంలో 1.64 కోట్ల చదరపు అడుగుల జాగా అందుబాటులో ఉంది.
ఇది 2024లో జరిగిన లావాదేవీల కంటే దాదాపు ఐదు రెట్లు ఎక్కువ. గత ఏడాది లావాదేవీల్లో రిటైల్ రంగం 33శాతం వాటాతో రెండో స్థానంలో ఉంది. తయారీ రంగంలో రెన్యువబుల్‌ఎనర్జీ, ఆటోమోటివ్ కంపెనీల నుంచి గిడ్డంకులకు ఎక్కువ డిమాండ్ ఉంది. శంషాబాద్ క్లస్టర్ గిడ్డంగుల కేంద్రంగా ఎదిగింది. మొత్తం లావాదేవీలలో ఈ క్లస్టర్ వాటా 47శాతం ఉంది.