హైదరాబాద్, వెలుగు: నేషనల్ రోలర్ స్కేటింగ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే తెలంగాణ జట్టుకు హైదరాబాద్ స్కేటర్లు రాధె లోయ, సుహాని అసావ ఎంపియ్యారు.. బెంగళూరులో డిసెంబర్ 5 నుంచి జరిగే ఈ టోర్నీ కోసం ఆదివారం ఎల్బీ స్టేడియంలో ఇంటర్ డిస్ట్రిక్ట్స్ స్కేటింగ్ చాంపియన్‌షిప్ కమ్ సెలక్షన్ ట్రయల్స్ నిర్వహించారు. రోలర్ ఫ్రీస్టయిల్ గర్ల్స్ అండర్ 11–14 విభాగంలో సత్తా చాటిన రాధె లోయ, సుహాని సెలెక్ట్ అయ్యారు.
ఎల్బీ స్టేడియంలో కోచ్ జితేందర్ గుప్త వద్ద శిక్షణ తీసుకుంటున్న రాధె గత రెండు నేషనల్స్‌లో గోల్డ్, సిల్వర్ మెడల్స్ సాధించింది. కాగా, నిషిత–జాన్వి గంజి (అండర్ 14–17), మోక్షిత్ రామ్–అన్ష్ (బాయ్స్ అండర్11–14) కూడా జట్టులో చోటు దక్కించుకున్నారు.